Begin typing your search above and press return to search.

అస్సలు గ్యాప్ లేదు...ఒకేసారి మూడేసి సినిమాల షూటింగ్స్ లో

ఒక విధంగా ప్రభాస్ ఖాళీ సమయంలోనే ఈ సినిమా పని పూర్తి చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇక మరోవైపు సందీప్ రెడ్డి వంగా కూడా ప్రభాస్ డేట్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు.

By:  Tupaki Desk   |   5 March 2024 5:39 AM GMT
అస్సలు గ్యాప్ లేదు...ఒకేసారి మూడేసి సినిమాల షూటింగ్స్ లో
X

పాన్ ఇండియా నెంబర్ వన్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం చాలా చాలా బిజీగా కనిపిస్తూ ఉన్నాడు. ఇండస్ట్రీలో ఏ హీరో కూడా ఇంత భారీ లైనప్ తో లేడు అని చెప్పవచ్చు. ప్రతి సినిమా కూడా చాలా డిఫరెంట్ గా ఉండడమే కాకుండా భారీ బడ్జెట్లో రూపొందుతూ ఉండటం విశేషం. ఇక ప్రభాస్ ప్రతి ఏడాది ఒకటి లేదా రెండు సినిమాలు అందించాలి అనే ఆలోచనతో ముందుకు సాగుతున్నట్లుగా అనిపిస్తోంది.

ఇక చిత్ర నిర్మాతలు దర్శకులు కూడా ప్రభాస్ బిజీగా ఉన్నప్పటికీ అడ్వాన్స్ ఇచ్చి ఏడాది లేట్ అయిన పర్వాలేదు వెయిట్ చేస్తామని చెబుతూ ఉండడం విశేషం. ఇక ప్రభాస్ ఒక ఏడాదిలో మూడు లేదా నాలుగు సినిమాల షూటింగ్స్ లలో పాల్గొంటూ ఉండడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎప్పుడు ఏ సినిమా సెట్స్ పైకి వస్తుందో చెప్పడం కూడా కష్టమే.

ఇక ప్రభాస్ ప్లానింగ్ కు అతని టైమింగ్ కు తగ్గట్టుగానే దర్శక నిర్మాతలు షూటింగ్స్ ప్లాన్ చేసుకుంటూ ఉండడం బాగా కలిసి వస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమా కు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. ఈ సినిమాను మే తొమ్మిదవ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. అలాగే మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ అనే సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది.

ఇక ఇటీవల బాబీ సింహా చెప్పిన దాన్ని బట్టి సలార్ 2 సినిమా ఏప్రిల్ లో మొదలవుతుంది అని టాక్. ఇప్పటికే కల్కి సినిమాతో గ్యాప్ లేకుండా షూటింగ్లో పాల్గొంటున్న ప్రభాస్ మరోవైపు చిన్న గ్యాస్ దొరికిన కూడా రాజాసాబ్ షూటింగ్ చేస్తూ ఉన్నాడు. ఒక విధంగా ప్రభాస్ ఖాళీ సమయంలోనే ఈ సినిమా పని పూర్తి చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇక మరోవైపు సందీప్ రెడ్డి వంగా కూడా ప్రభాస్ డేట్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు.

దాదాపు స్పిరిట్ స్క్రిప్ట్ పనులు ఫినిష్ అయ్యాయి ఇక ప్రభాస్ తో అతను ఈ ఏడాది చివర్లోనే షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉంది. అంటే ప్రభాస్ సలార్ 2, ప్రస్తుతం ఉన్న కల్కి, రాజా సాబ్ సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుపుకోబోతున్నాయి. ఇక కల్కి తర్వాత కూడా సందీప్ సినిమా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రభాస్ ఈ ఏడాది ఒకేసారి మూడేసి సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటూ ఉన్నాడు. మరి ఇంత బిజీగా ఉన్న ప్రభాస్ మరో రెండు కొత్త సినిమాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నట్లు టాక్. అందులో హను రాఘవపూడి సినిమా కూడా ఉంది.