Begin typing your search above and press return to search.

ప్రభాస్ అనుష్క.. ఆ ఛాన్స్ ఉందంటారా..?

అంతేకాదు ప్రభాస్ అనుష్క ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్ షిప్ కూడా వారి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యేలా చేసింది.

By:  Tupaki Desk   |   21 March 2024 11:30 PM GMT
ప్రభాస్ అనుష్క.. ఆ ఛాన్స్ ఉందంటారా..?
X

రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ హీరోయిన్ అనుష్క.. ఈ ఇద్దరి కాంబినేషన్ సినిమా అంటే ఫ్యాన్స్ కి పండుగ అన్నట్టే. వెండితెర మీద ఎన్నో సూపర్ హిట్ జోడీల్లో ఇది కూడా ఒకటి. బిల్లా తో మొదలైన ప్రభాస్, అనుష్క జోడీ మిర్చి, బాహుబలి 1 అండ్ 2 సినిమాల్లో నటించారు. నటించిన సినిమాలు తక్కువే అయినా ప్రభాస్ కటౌట్ కి అనుష్క జోడీ పర్ఫెక్ట్ అనిపించుకుంది. అందుకే వీరిద్దరు కలిసి నటిస్తే ఆ సినిమా పక్కా హిట్ అనే సెంటిమెంట్ ఏర్పడింది. అంతేకాదు ప్రభాస్ అనుష్క ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్ షిప్ కూడా వారి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యేలా చేసింది.

బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళ్తున్నాడు. అయితే ఆ సినిమాలో నటించిన అనుష్క మాత్రం తర్వాత సినిమాల వేగం తగ్గించింది. నిశ్శబ్ధం తర్వాత చాలా గ్యాప్ ఇచ్చిన అనుష్క లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేయగా లేటెస్ట్ గా క్రిష్ డైరెక్షన్ లో సినిమా చేస్తుంది. అనుష్క వరుస సినిమాలు చేయాలని తన ఫ్యాన్స్ కోరుతున్నారు.

ఈ క్రమంలో ప్రభాస్ తో కలిసి అనుష్క సినిమా చేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఫాక్ట్ చెక్ చూస్తే ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. అనుష్కతో కలిసి సినిమా చేయాలంటే అది నెక్స్ట్ లెవెల్ లో ఉండాలి. కావాలని కాంబో సెట్ చేసే పరిస్థితి అయితే ఉండదు. అదీగాక ప్రభాస్ అనుష్క ఎప్పుడు కలిసి నటించినా వారి మ్యారేజ్ మీద మళ్లీ వార్తలు ఊపందుకుంటాయి. ఈ కారణాల వల్ల వాళ్లిద్దరు కలిసి జత కట్టే ఆసక్తి చూపట్లేదు.

ఇటు రెబల్ ఫ్యాన్స్.. అటు స్వీటీ ఫ్యాన్స్ మాత్రం మళ్లీ తెర మీద ప్రభాస్ అనుష్కను జంటగా చూడాలని కోరుతున్నారు. అభిమానుల కోరిక మేరకు మిగతా వారు ఎవరెలా అనుకున్నా మాకెందుకు అని ప్రభాస్ తో అనుష్క కలిసి నటిస్తుందా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో సందీప్ వంగతో స్పిరిట్, హను రాఘవపుడితో సినిమాకు హీరోయిన్స్ లాక్ అవ్వలేదు. మరి ఈ సినిమాల్లో ఏమైనా అనుష్క నటిస్తుందా అన్నది చూడాలి.