Begin typing your search above and press return to search.

పూరితో తారక్, ప్రభాస్.. వ్వాటే మూమెంట్!

పూరి జగన్నాథ్ టాలీవుడ్ లో స్టార్ దర్శకుడిగా ఒక చక్రం తిప్పాడు. దాదాపు స్టార్ హీరోలు అందరూ కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మూవీస్ చేశారు.

By:  Tupaki Desk   |   10 Sept 2023 10:25 AM IST
పూరితో తారక్, ప్రభాస్.. వ్వాటే మూమెంట్!
X

పూరి జగన్నాథ్ టాలీవుడ్ లో స్టార్ దర్శకుడిగా ఒక చక్రం తిప్పాడు. దాదాపు స్టార్ హీరోలు అందరూ కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మూవీస్ చేశారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలుగా ఉన్న రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, తారక్ పూరి హీరోలుగా ఉన్నవారే. వారికి డాషింగ్ డైరెక్టర్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు. ప్రభాస్ తో బుజ్జిగాడు సినిమా చేసి డార్లింగ్ అనే బ్రాండ్ అందరికి రీచ్ అయ్యేలా చేశాడు.

ఏక్ నిరంజన్ తో సక్సెస్ కొట్టకపోయిన ప్రభాస్ ని మరో యాంగిల్ గా రిప్రజెంట్ చేశారు. ఇక టెంపర్ మూవీతో తారక్ కి కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. ఈ సినిమాలో తారక్ పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు. పూరి జగన్నాథ్ తో వర్క్ చేయడానికి కూడా మన హీరోలు చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఆయనతో షూటింగ్ అంటే చాలా జోవియల్ గా ఒక హాలిడే ట్రిప్ లా వెళ్ళిపోతుంది.

తాజాగా పూరి జగన్నాథ్, తారక్, ప్రభాస్ కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటో చూసిన వారు పూరి జగన్నాథ్ తో సినిమాలు చేసిన అందరూ పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారంటూ గుర్తు చేసుకుంటున్నారు. టాలీవుడ్ కి నెగిటివ్ హీరోయిజాన్ని అలవాటు చేసి, కమర్షియల్ ఫార్మాట్ కి కొత్త భాష్యం చెప్పిన డైరెక్టర్ గా పూరి పేరు వినిపిస్తూ ఉంటుంది.


పూరి జగన్నాథ్ ఫ్యామిలీ ఫంక్షన్ కి జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ అటెండ్ అయ్యారు. 12 ఏళ్ళ క్రితం అప్పుడప్పుడే స్టార్స్ గా తారక్, ప్రభాస్ ఎదుగుతున్న సమయంలో దిగిన పిక్ ఇది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మేకోవర్ కి ముందు ప్రభాస్ ఎలా ఉండేవాడో అని డార్లింగ్ అభిమానులు షేర్ చేసుకుంటూ ఉంటె. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరో అంటూ వైరల్ చేస్తున్నారు.

పూరి జగన్నాథ్ కి మన స్టార్ హీరోలతో ఎంత మంచి సత్సంబంధాలు ఉన్నాయనేది ఈ పిక్ చూస్తేనే అర్ధమైపోతుంది. ప్రస్తుతం కెరియర్ పరంగా పూరి కొద్దిగా డౌన్ అయ్యారని చెప్పాలి. డబుల్ ఇస్మార్ట్ తో తిరిగి తనని తాను ప్రూవ్ చేసుకొని ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నారు.