Begin typing your search above and press return to search.

రెబల్ స్టార్ నుంచి ఫ్యాన్స్ అది కోరుతున్నారు..!

ఈ ముగ్గురు హీరోల సినిమాల్లో వారి యాక్షన్ తో పాటుగా డ్యాన్స్ కూడా ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ అందిస్తుంది.

By:  Tupaki Desk   |   1 May 2024 2:45 AM GMT
రెబల్ స్టార్ నుంచి ఫ్యాన్స్ అది కోరుతున్నారు..!
X

స్టార్ హీరోలు తమ ఫ్యాన్స్ ను మెప్పించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం తమ యాక్టింగ్ తోనే కాదు వారి ఫ్యాన్స్ తమ నుంచి కోరుకునే అంశాల్లో కూడా వారు అదరగొట్టేస్తున్నారు. తెలుగు హీరోల్లో చిరంజీవి తర్వాత ఆ రేంజ్ డ్యాన్స్ చేస్తూ డ్యాన్స్ లో వీళ్లకు తిరుగు లేదని అనిపించుకుంటున్నారు ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్, రాం చరణ్. ఈ ముగ్గురు హీరోల సినిమాల్లో వారి యాక్షన్ తో పాటుగా డ్యాన్స్ కూడా ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ అందిస్తుంది.

అయితే వీరికి ఈక్వల్ రేంజ్ అంతకన్నా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న ప్రభాస్, మహేష్ లు మాత్రం డ్యాన్స్ విషయంలో అంత సీరియస్ గా ఉండరు. ఏదో సినిమాకు సాంగ్స్ అవసరం కాబట్టి చేసేద్దాం అన్నట్టు వారి ఆలోచన ఉంటుంది. బ్రహ్మోత్సవం సినిమా టైం లో అయితే మహేష్ తన డ్యాన్స్ మూమెంట్స్ తో విపరీతంగా ట్రోల్స్ కు గురయ్యాడు. ఆర్జీవి కూడా మహేష్ ని టార్గెట్ చేస్తూ ట్వీట్లు వేశాడు.

అలాంటి మహేష్ కుర్చీ మడతపెట్టి అంటూ డ్యాన్స్ అదరగొట్టేశాడు. మహేష్ డ్యాన్స్ చేస్తే చూడాలని అనుకున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోరిక తీరింది. అయితే ఇప్పుడు రెబల్ స్టార్ ఫ్యాన్స్ కూడా ప్రభాస్ మంచి డ్యాన్స్ నెంబర్ వేస్తే చూడాలని అనుకుంటున్నారు. ఫ్యాన్స్ కోసం ఏదైనా చేసే ప్రభాస్ నెక్స్ట్ సినిమాలో ఒక మంచి డ్యాన్స్ నెంబర్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వస్తున్న రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ డ్యాన్స్ తో కూడా మెప్పిస్తాడని అంటున్నారు. ప్రభాస్ కూడా డ్యాన్స్ చేయడం మొదలు పెడితే స్టార్స్ మధ్య ఫైట్ మరింత టఫ్ గా మారే ఛాన్స్ ఉంటుంది. అయితే డ్యాన్స్ లో ఎవరి స్టైల్ వారిది. ఒకరు వేసినట్టు మరొకరు వేయాలన్న రూల్ ఏమి లేదు. మహేష్ కెరీర్ లోనే కుర్చీ మడతపెట్టి అనేది బెస్ట్ అనిపించింది. అలానే ప్రభాస్ కూడా డ్యాన్స్ లో తన బెస్ట్ ఇస్తే చూడాలని రెబల్ స్టార్ ఫ్యాన్స్ కోరుతున్నారు.

నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న కల్కి 2898 ఏడి సినిమా జూన్ 27న రిలీజ్ లాక్ చేయగా రాజా సాబ్ సినిమాను 2025 సంక్రాంతికి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలతో ప్రభాస్ మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా చూపించాలని ఫిక్స్ అయ్యారని చెప్పొచ్చు.