Begin typing your search above and press return to search.

బన్నీ × ప్రబాస్.. ఈ అడుగులతో భూకంపాలే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేర్లు ఇప్పుడు దేశ వ్యాప్తంగా గట్టిగా వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   3 April 2024 5:00 AM GMT
బన్నీ × ప్రబాస్.. ఈ అడుగులతో భూకంపాలే..
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేర్లు ఇప్పుడు దేశ వ్యాప్తంగా గట్టిగా వినిపిస్తున్నాయి. వారి స్టామినా, టాలెంట్ కి ఇప్పటికే సినీ అభిమానులు అందరూ కూడా ఫిదా అయిపోయారు. బాహుబలి సిరీస్ తో ప్రభాస్ ఇండియన్ సూపర్ స్టార్ గా మారితే, పుష్పతో అల్లు అర్జున్ తన స్టామినా ఏంటో చూపించాడు. పుష్పతో నేషనల్ అవార్డు అందుకున్న మొట్టమొదటి తెలుగు హీరోగా బన్నీ అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

ఇక మరికొన్ని రోజుల్లో వీరిద్దరి నించి నెవ్వర్ బిఫోర్ అనేలా భారీ సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. ప్రభాస్ సలార్ ఏ రేంజ్ లో సౌండ్ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. సినిమాకి ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయిన ప్రభాస్ అనే కటౌట్ జనాలను థియేటర్స్ కి వచ్చేలా చేసింది. పుష్ప మూవీతో నార్త్ లో తగ్గేదిలే అంటూ అందరూ తనని ఫాలో అయ్యేలా బన్నీ చేసుకున్నాడు. ఇప్పుడు రాబోయే పుష్ప ది రూల్ కోసం అక్కడి ఆడియన్స్ ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.

ప్రభాస్ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ కల్కి 2898ఏడీతో రాబోతున్నాడు. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా కల్కి రాబోతోంది. ఈ సినిమా టీజర్ కోసం పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు. మూవీ నుంచి వస్తోన్న పోస్టర్స్ సినిమాపై హైప్ పెంచుతున్నాయి. తాజా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ టీజర్ రిలీజ్ కి సంబందించిన అప్డేటెడ్ పోస్టర్ వచ్చింది. ఈ పోస్టర్ లో కాళ్ళకి గజ్జె కట్టుకొని చుట్టూ దీపాల మధ్యలో బన్నీ డాన్స్ చేస్తున్న స్టిల్ ఉంది. ఆ పోస్టర్ లో ఏప్రిల్ 8న టీజర్ రిలీజ్ ఉంటుందని డేట్ మెన్షన్ చేశారు.

పోస్టర్ లో స్టిల్ చూస్తుంటే పూనకాలు తెప్పించే లెవల్ లో గంగమ్మ జాతరలో అల్లు అర్జున్ డాన్స్ ఉండబోతోందని స్పష్టం అవుతోంది. ఇక కల్కి షూటింగ్ కి సంబంధించి గత నెల ఒక ఫోటో రిలీజ్ చేసి అప్డేట్ ఇచ్చారు. అందులో ప్రభాస్ పాదాలు ఎలివేట్ చేశారు. దీనిని బట్టి కల్కి 2898ఏడీ లో కూడా మంచి డాన్స్ సీక్వెన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఈ ఇద్దరి పాదాలకి సంబందించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ పాదాలు ఈ ఏడాది బాక్సాఫీస్ ని షేక్ చేయాలని, బాక్సాఫీస్ వద్ద భూకంపమే అంటూ అభిమానులు ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు. ట్రేడ్ పండితులు కూడా కూడా 2024 ఈ ఇద్దరి స్టార్స్ దే హవా అని అంటున్నారు. మరి ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాలు ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాయో చూడాలి.