Begin typing your search above and press return to search.

ఇక ఈ స్టార్ హీరోకు అన్ని సీక్వెల్ సినిమాలే..

కల్కితో కలుపుకుంటే ప్రభాస్ ఖాతాలో మొత్తం మూడు సినిమాలు పార్ట్ 2లు కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తోన్న దేవర రెండు భాగాలుగానే సిద్ధం అవుతోంది.

By:  Tupaki Desk   |   28 Dec 2023 4:11 AM GMT
ఇక ఈ స్టార్ హీరోకు అన్ని సీక్వెల్ సినిమాలే..
X

ఈ మధ్యకాలంలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా బిగ్ బడ్జెట్ సినిమా రిలీజ్ అప్పుడే పార్ట్ 2 కూడా ఉంటుందని దర్శక, నిర్మాతలు ఎనౌన్స్ చేసేస్తున్నారు. కథని బట్టి రెండు భాగాలుగా ఈ సినిమాని తీసుకొస్తున్నాం అని చెబుతున్నారు. అయితే దీని వెనుక ఉన్న మార్కెట్ స్ట్రాటజీ వేరు. అలాగే దానికి ఉండే హైప్ వేరు. ఇక బాహుబలి పార్ట్ 1 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

అయితే కలెక్షన్స్ వెయ్యి కోట్లు కూడా దాటలేదు. కాని బాహుబలి తీసుకొచ్చిన హైప్ కారణంగా బాహుబలి 2 ఏకంగా 1900 కోట్లకి పైగా కలెక్షన్స్ ని ప్రపంచ వ్యాప్తంగా కొల్లగొట్టింది. అలాగే కేజీఎఫ్ చాప్టర్ 1 హిట్ అయిన గట్టిగా చూసుకుంటే 334 కోట్లు కలెక్ట్ చేస్తే చాప్టర్ 2 ఏకంగా 1200 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ లెక్కలు చూసిన తర్వాత సీక్వెల్ బాక్సాఫీస్ దగ్గర ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో అర్ధం చేసుకోవచ్చు.

ఈ కారణంగానే ప్రతి సినిమాకి పార్ట్ 2కి లీడ్ ఇచ్చే విధంగా క్లైమాక్స్ ని దర్శకులు డిజైన్ చేసుకుంటున్నారు. అయితే కొన్ని కథలని రెండు భాగాలుగా చేయడానికి స్కోప్ ఉంటుంది. కాని కొన్ని సినిమాలకి మాత్రం కావాలని పెట్టినట్లు ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్ సలార్ మూవీకి కూడా సీక్వెల్ కి కావాల్సినంత స్కోప్ ఉంది. సలార్ పార్ట్ 1 లో ప్రశాంత్ నీల్ ఇంకా పూర్తి కథని చెప్పలేదు.

అసలైన కథ మొత్తం పార్ట్ 2 అయిన శౌర్యాంగ పర్వంలోనే ఉండబోతోంది. ఈ కారణంగా ఈ పార్ట్ 2 మీద ఎగ్జైటింగ్ పెరిగింది. దీని తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తోన్న కల్కి 2898 ఏడీ కూడా రెండు భాగాలుగానే తెరకెక్కుతోంది. కల్కితో కలుపుకుంటే ప్రభాస్ ఖాతాలో మొత్తం మూడు సినిమాలు పార్ట్ 2లు కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తోన్న దేవర రెండు భాగాలుగానే సిద్ధం అవుతోంది.

అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుతో జక్కన్న చేయబోయే సినిమా కూడా రెండు భాగాలుగానే ఉండబోతోందని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాకి కూడా సీక్వెల్ చేస్తానని రాజమౌళి ప్రకటించాడు. యానిమల్ మూవీకి పార్ట్ 2గా యానిమల్ పార్క్ రానుంది. పుష్ప పార్ట్ 2 ఇప్పుడు తెరకెక్కుతోంది. మరి ప్రభాస్ స్పిరిట్ మూవీని సందీప్ రెడ్డి రెండు భాగాలుగా చేస్తాడా లేదంటే ఒక భాగంతోనే ఎండ్ చేస్తాడా అనేది చూడాలి. బాక్సాఫీస్ లెక్కలని ఫాలో అయితే మాత్రం స్పిరిట్ కి కూడా పార్ట్ 2ని సందీప్ ప్లాన్ చేసే అవకాశం ఉంది.