Begin typing your search above and press return to search.

ఓన్లీ వన్ సెకండ్.. కానీ ఎక్కడ చూసినా ప్రభాసే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 Jun 2024 4:52 AM GMT
ఓన్లీ వన్ సెకండ్.. కానీ ఎక్కడ చూసినా ప్రభాసే!
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ సినిమాలతో వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. దీంతో ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ పై అందరి దృష్టి పడింది. గత ఏడాది రెండు సినిమాలతో వచ్చిన ఆయన.. ఇప్పుడు చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. వరుస షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. మరో 12 రోజుల్లో కల్కి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన ప్రభాస్ లుక్స్ అండ్ గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. కల్కి షూటింగ్ అయ్యాక.. రాజా సాబ్ సెట్స్ లో ప్రభాస్ అడుగుపెట్టినట్టు వీడియోలు బయటకొచ్చాయి. సినిమాలోని సాంగ్స్ ను షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతలో సలార్-2 షూట్ అతి త్వరలో ప్రారంభం కానున్నట్లు అప్డేట్ వచ్చింది. దీంతో రాజా సాబ్ రిలీజ్ కాస్త లేట్ అవ్వవచ్చని టాక్ వినిపిస్తోంది.

ఆ తర్వాత ప్రభాస్ లైనప్ లో సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ తో పాటు హను రాఘవపూడి పీరియాడిక్ మూవీ ఉంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్నాయి. ఇంత బిజీ షెడ్యూల్ మధ్య ప్రభాస్.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పలో యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. విజువల్స్, వెపన్స్ అండ్ మేకింగ్ కు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి.

అయితే టీజర్ లో ప్రభాస్ ఒకే ఒక్క సెకండ్ పాటు కనిపించారు. అది కూడా ఆయన కళ్లు మాత్రమే చూపించారు. ఆయన ఏ రోల్ చేస్తున్నారన్న విషయంతోపాటు లుక్ కూడా రివీల్ చేయలేదు. కానీ టీజర్ లోని ప్రభాస్ కళ్లు స్క్రీన్ షాట్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఎక్కడ చూసినా ఆ ఫోటోనే కనిపిస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు. టీజర్ ను ప్రదర్శించిన అన్ని చోట్ల ప్రభాస్ కనిపించగానే.. థియేటర్లు దద్దరిల్లిపోయాయని సమాచారం.

ఇక ప్రభాస్ నందీశ్వరుడిగా క్యామియో రోల్ లో కనిపిస్తారని అంతా ఇప్పటి వరకు అనుకున్నారు. కానీ మంచు విష్ణు.. సినిమాలో ప్రభాస్ ది పెద్ద పాత్ర అని తెలిపారు. మరికొద్ది రోజుల్లో ప్రభాస్ రోల్ కు సంబంధించిన విషయాలను చెప్తామని అన్నారు. మూవీలో తనతో తప్ప అందరితో నటించారని చెప్పారు. దీంతో ప్రభాస్ పాత్రపై అంచనాలు పెరిగాయి. మరి కన్నప్పలో ప్రభాస్ ఎలా కనిపిస్తారో? ఎంతలా ఆకట్టుకుంటారో? వేచి చూడాలి.