Begin typing your search above and press return to search.

గ్లోబ‌ల్ రేంజ్ లో డార్లింగ్ త‌డ‌బాటు!

ఇలా ఇండియా వైడ్ ప్ర‌భాస్ అంటే ఓ బ్రాండ్ గా మారాడు. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. కానీ గ్లోబ‌ల్ స్థాయిలో ప్ర‌భాస్ మాత్రం ఫేమ‌స్ కాలేక‌పోతున్నాడు? అన్న‌ది అంతే వాస్త‌వం.

By:  Tupaki Desk   |   23 April 2025 5:16 PM IST
గ్లోబ‌ల్ రేంజ్ లో డార్లింగ్ త‌డ‌బాటు!
X

పాన్ ఇండియా తొలి హీరో ఎవ‌రు? అంటే డార్లింగ్ ప్ర‌భాస్ అని చెబుతారంతంతా. పాన్ ఇండియా అనే వ‌ర్డ్ ని ప‌రిచ‌యం చేసిందే ప్ర‌భాస్. 'బాహుబ‌లి' తీసి పాన్ ఇండియాలో తొలి హిట్ న‌మోదు చేసాడు. అటుపై సాహో తో హిందీ మార్కెట్ లో మ‌రింత స్టేబుల్ అయ్యాడు. అనంత‌రం కొన్ని రెండు..మూడు ప్ర‌య త్నాలు ఫెయిలైనా మ‌ళ్లీ `స‌లార్` తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. `క‌ల్కి 2898` తో మ‌రింత‌గా నిల‌దొక్కు కున్నాడు.

ఇలా ఇండియా వైడ్ ప్ర‌భాస్ అంటే ఓ బ్రాండ్ గా మారాడు. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. కానీ గ్లోబ‌ల్ స్థాయిలో ప్ర‌భాస్ మాత్రం ఫేమ‌స్ కాలేక‌పోతున్నాడు? అన్న‌ది అంతే వాస్త‌వం. ఇత‌ర దేశాల్లో అభిమాను లున్న‌ప్ప‌టికీ ప్ర‌భాస్ నుంచి పాన్ ఇండియా సినిమా అనౌన్స్ మెంట్ వ‌చ్చిందంటే? అది కేవ‌లం ఇండియాకే ప‌రిమితం అవుతుంది త‌ప్ప‌! గ్లోబ‌ల్ స్థాయిలో రీచ్ అవ్వ‌డం లేదు.

సూప‌ర్ స్టార్ మహేష్ తో రాజ‌మౌళి ఎస్ ఎస్ ఎంబీ 29 ప్ర‌క‌టించ‌గానే అదో గ్లోబ‌ల్ ప్రాజెక్ట్ గా నెట్టింట వైర‌ల్ అయింది. అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్ అని రివీల్ చేయ‌డంతో ప్ర‌పంచ దేశాల‌కు చేరింది. మ‌హేష్ ఒక్క పాన్ ఇండియా చేయ‌కుండానే గ్లోబ‌ల్ స్థాయిలో ఈ రేంజ్ లో ప్ర‌చారం ద‌క్కింది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 22వ చిత్రం కూడా గ్లోబ‌ల్ రేంజ్ లో ఫేమ‌స్ అవుతుంది.

అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమా విజువ‌ల్ ఎఫెక్స్ట్ ప‌నులు న్యాయార్క్ లాంటి సిటీల్లో ప్లాన్ చేయ‌డం.. ..దుబాయ్ లో స్టోరీ డిస్క‌ష‌న్ జ‌ర‌గడం వంటి స‌న్నివేశాల‌తో ఈ సినిమాకు గ్లోబ‌ల్ స్థాయిలో ప్ర‌చారం ద‌క్కు తుంది. కేవ‌లం రెండ‌వ సినిమాతోనే గ్లోబ‌ల్ రేంజ్ కి చేరిపోయాడు. కానీ ప్ర‌భాస్ అన్ని పాన్ ఇండి యా సినిమాలు చేసినా? ఏది గ్లోబ‌ల్ రేంజ్ కి రీచ్ అవ్వ‌లేదు. `క‌ల్కి 2898` లాంటి యూనివ‌ర్శ‌ల్ కాన్సెప్ట్ తీసుకున్నా? అది ఇండియాకు సంబంధించిన చ‌రిత్ర కావ‌డంతో గ్లోబ‌ల్ స్థాయికి రీచ్ అవ్వ‌లేదు. ఈ విష‌యంలో ప్రభాస్ మ‌రింత స్ట్రాట‌జీ అనుస‌రిస్తే త‌ప్ప రీచ్ అవ్వ‌డం క‌ష్టం.