Begin typing your search above and press return to search.

ఫౌజీ'లో మిర్చి జై ని చూడబోతున్నామా?

ఎట్టకేలకు జై తరహా లుక్‌లో ప్రభాస్ కనిపించబోతున్నట్లు సమాచారం అందుతోంది.

By:  Tupaki Desk   |   2 July 2025 2:00 PM IST
ఫౌజీలో మిర్చి జై ని చూడబోతున్నామా?
X

ప్రభాస్‌ 'బాహుబలి'కి ముందు చేసిన సినిమాల్లో లుక్‌ సింపుల్‌ అండ్ స్వీట్‌గా ఉండేది. కానీ బాహుబలి, సాహో, రాధేశ్యామ్‌ ఇలా ఈ మధ్య కాలంలో చేసిన సినిమాల్లో లుక్‌ విభిన్నంగా ఉంటూ వచ్చింది. కానీ చాలా మంది అభిమానులు ప్రభాస్ వింటేజ్‌ లుక్‌ను ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా మిర్చి సినిమాలో జై పాత్రలో ప్రభాస్‌ లుక్‌ను ప్రతి ఒక్క అమ్మాయి ఇష్టపడుతుంది అనడంలో సందేహం లేదు. జై లాంటి అబ్బాయి తమ జీవితంలో ఉండాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు. చాలా మంది అబ్బాయిలు కూడా మనలో ఒకడు జై అన్నట్లుగా ఫీల్‌ అవుతారు. అలాంటి జై లుక్‌ లో మళ్లీ ప్రభాస్‌ ఎప్పుడు కనిపిస్తాడు అంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు.


ఎట్టకేలకు జై తరహా లుక్‌లో ప్రభాస్ కనిపించబోతున్నట్లు సమాచారం అందుతోంది. ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో చేస్తున్న 'రాజాసాబ్‌' సినిమాలో మాస్‌ లుక్‌లో కనిపించబోతున్నాడు. కానీ ఫౌజీ సినిమాలో మాత్రం కాస్త క్లాస్‌గా, వింటేజ్‌ లుక్‌లో ప్రభాస్ కనిపించబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ప్రభాస్‌ లుక్‌ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అందులో ప్రభాస్‌ను చూస్తూ ఉంటే దశాబ్ద కాలం వెనక్కి వెళ్లినట్లు ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్‌ మిర్చిలో జై పాత్రలో ఎలా కనిపించాడో అలాగే ఈ లుక్‌లో కనిపిస్తున్నాడు అంటూ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరూ అంటున్నారు.

ఫౌజీ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం జరుగుతోంది. ఆ సినిమా షూటింగ్‌ సందర్భంగానే ఈ ఫోటో దిగి ఉంటాడని, ఆ ఫోటో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుందని అంటున్నారు. ఫౌజీలో ఖచ్చితంగా ఈ లుక్‌తో కనిపిస్తాడని, తద్వారా సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. సోషల్‌ మీడియాలో ఈ సినిమా గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు దర్శకుడు హను రాఘవపూడి అధికారికంగా ప్రకటన చేయడం కానీ, లుక్ రివీల్ చేయడం కానీ చేయడం లేదు. ముందు ముందు ఈ సినిమాను ఓ రేంజ్‌లో ప్రమోట్‌ చేస్తామని మాత్రం ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో మేకర్స్ ప్రకటించారు.

ప్రభాస్‌కు జోడీగా ఈ సినిమాలో సోషల్‌ మీడియా ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుంది. సీతారామం సినిమా తర్వాత హను రాఘవపూడి నుంచి రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. కచ్చితంగా పాన్‌ ఇండియా కంటెంట్‌తో ఈ సినిమా రూపొందించే సత్తా హను రాఘవపూడికి ఉంది. అందుకే ఈ సినిమాతో మరోసారి హను రాఘవపూడి తన సత్తా చాటబోతున్నాడు.

న్యూ ఏజ్ లవ్‌ స్టోరీస్‌ను విభిన్నంగా చూపించడంలో హనుకి ప్రత్యేకమైన శైలి ఉంది. అందుకే ఈ సినిమాలో ప్రభాస్ లుక్‌తో పాటు, పాత్ర విషయంలోనూ అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. రాజాసాబ్‌ సినిమా విడుదల వాయిదా పడుతున్న నేపథ్యంలో ఫౌజీ ముందే వస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఈ ఏడాదిలో ఫౌజీ విడుదల చేయాలని ప్రభాస్ అభిమానులు కోరుతున్నారు. మరి రిలీజ్ ఎప్పుడు ఉంటుందో చూడాలి.