ప్రభాస్ ఫ్యాన్స్ కన్ఫ్యూజన్.. క్లారిటీ వచ్చేది అప్పుడే!
టీజర్ రెడీగా ఉంది. అయితే ప్రభాస్ డబ్బింగ్ చెప్పాలి. అప్పుడే రిలీజ్ చేస్తారు అని ఓ వార్త ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
By: Tupaki Desk | 1 May 2025 2:00 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తున్నారు. ఆయన అంగీకరించిన దాదాపు అన్ని సినిమాలు అంటే ఒక్క స్పిరిట్, ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్, సలార్ 2 తప్ప అన్ని సెట్స్‌పైనే ఉన్నాయి. అయితే ప్రభాస్ ప్రాజెక్ట్‌లపై వరుసగా నెట్టింట రక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మారుతి డైరెక్షన్‌లో తొలి సారి నటిస్తున్న హారర్ కామెడీ `ది రాజా సాబ్` రిలీజ్‌కు రెడీగా ఉంది. ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ అయ్యాయి. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిన విషయం తెలిసిందే. ప్రభాస్ ఇందులో తండ్రిగా, తనయుడిగా రెండు విభిన్నమైన క్యారెక్టర్లలో నటిస్తున్నారు.
టీజర్ రెడీగా ఉంది. అయితే ప్రభాస్ డబ్బింగ్ చెప్పాలి. అప్పుడే రిలీజ్ చేస్తారు అని ఓ వార్త ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అంతేనా హను రాఘవపూడి డైరెక్షన్‌లో ప్రభాస్ నటిస్తున్న రొమాంటిక్ లవ్ వార్ డ్రామా `ఫౌజీ` షూటింగ్ రాకెట్ స్పీడుతో పరుగులు పెడుతోందని, ఎట్టిపరిస్థితుల్లోనూ అది ఈ ఏడాదే విడుదలవుతుందని మరో వార్త. ఇక రా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించనున్న `స్పిరిట్` షూటింగ్ కోసం కొంత కాలం వేచి చూడక తప్పదని, దీనికంటే ముందు ప్రభాస్ `హనుమాన్` ఫేమ్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్న మూవీని పూర్తి చేస్తాడని, ఆ తరువాతే `స్పిరిట్`కు డేట్స్ కేటాయిస్తాడని టాక్ నడుస్తోంది.
అంతే కాకుండా ఈ ఏడాది చివర్లో నాగ్ అశ్విన్ సరికొత్త ప్రపంచం `కల్కి 2` మొదలవుతుందని, కొంత మంది లేదు లేదు ఎన్టీఆర్ సినిమా పూర్తి చేసి ప్రశాంత్ నీల్ `సలార్ 2`ని స్టార్ట్ చేస్తాడని మరి కొంత మంది అంటున్నారు. దీంతో ప్రభాస్ అభిమానుల్లో కన్ఫ్యూజన్ మొదలైంది. ఏ ప్రచారం నిజం, ఏది అబద్దం అని అంతా తలలు పట్టుకుంటున్నారు. అయితే ఈ కన్ఫ్యూజన్‌కు తెరపడాలంటే ప్రభాస్ బరిలోకి దిగాల్సిందే. ప్రస్తుతం విదేశాల్లో విశ్రాంతి తీసుకుంటున్న ప్రభాస్ త్వరలో ఇండియా తిరిగి రానున్నారు. అప్పుడే వరుస ప్రాజెక్ట్‌లపై ఓ క్లారిటీ రానుంది.
ప్రభాస్ మునుపెన్నడూ లేని విధంగా, మిగతా హీరోలకు భిన్నంగా వరుసగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లు చేస్తుండటం. వాటికి డేట్స్ కేటాయిస్తూ బిజీ బిజీగా గడిపేస్తుండటం, ఇందులో ఏది ముందు పూర్తయి థియేటర్లలోకి వస్తుందనే క్లారిటీ అభిమానులకు లేకపోవడం వల్లే తాజా వార్తలు చక్కర్లు కొడుతున్నాయిని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది లేదా 2026లో మాత్రం ది రాజా సాబ్` కానీ `ఫౌజీ` కానీ విడుదల కావడం ఖాయమని ఇన్ సైడ్ టాక్. అభిమానుల డిమాండ్ కూడా అదే కావడంతో ప్రభాస్ ఈ సినిమాల విషయంలో వేగం పెంచనున్నాడని తెలుస్తోంది.
