బిగ్ లైనప్ కానీ..కన్ఫ్యూజన్‌లో ప్రభాస్ ఫ్యాన్స్
`బాహుబలి` సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ ఆ క్రేజ్‌కు తగ్గట్టే వరుసగా భారీ పాన్ ఇండియా మూవీస్ చేస్తూ క్షణం తీరికలేకుండా గడిపేస్తున్నాడు.
By: Tupaki Desk | 7 April 2025 1:00 PM IST`బాహుబలి` సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ ఆ క్రేజ్‌కు తగ్గట్టే వరుసగా భారీ పాన్ ఇండియా మూవీస్ చేస్తూ క్షణం తీరికలేకుండా గడిపేస్తున్నాడు. కల్కి తరువాత ప్రభాస్ వరుసగా ఆరు ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇందులో మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న కామెడీ హారర్ థ్రిల్లర్ `రాజా సాబ్` ఒకటి. గత కొంత కాలంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది కానీ రిలీజ్ ఎప్పుడనే విషయంపై మాత్రం ఇంత వరకు క్లారిటీ లేదు.
ఈ ఏడాది ఖచ్చితంగా ప్రభాస్ నుంచి వచ్చే సినిమా ఇదే అని అంతా భావించారు. అభిమానులు కూడా ఎదురుచూశారు. కానీ `రాజా సాబ్` మాత్రం ఈ ఏడాది వచ్చేలా కనిపించడం లేదు. కారణం కొంత భాగం షూటింగ్ పెండింగ్‌గా ఉండటమేనని వార్తలు వినిపిస్తున్నాయి. అంతా అనుకున్నట్టుగా పూర్తయితే వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
దీని తరువాత ప్రభాస్ అంగీకరించిన మరో భారీ మూవీ `సలార్ 2` శౌర్యాంగ పర్వం`. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయనున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ రిలీజ్‌కు ముందే పార్ట్ 2 టీజర్‌ని రిలీజ్ చేసి ఈ సినిమాపై దర్శకుడు ప్రశాంత్ నిల్ ఎక్స్‌పెక్టేషన్స్ ని స్కై హైకి చేర్చారు. అయితే `సలార్` విడుదలై ఏడాది దాటినా ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి సౌండ్ వినిపించడం లేదు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే దానిపై క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ `ఫౌజీ` మూవీ చేస్తున్నాడు. దీని షూటింగ్ శరవేగంగా జరుగతోంది. కానీ `రాజా సాబ్` రిలీజ్ అయితే కానీ ఈ సినిమా రిలీజ్‌పై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
ఇక `ఫౌజీ` తరువాత ప్రభాస్ ...క్రేజీ వైల్డ్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగతో కలిసి `స్పిరిట్`కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. దీనితో పాటు `కల్కి 2` కూడా లైన్‌లో ఉంది. అయితే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఇది ఎప్పటికి మొదలవుతుందన్నది స్పష్టతలేదు. వీటితో పాటు ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ప్రభాస్ చేతి నిండా క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నా కానీ ఏ సినిమా రిలీజ్ అవుతుందన్న విషయంలో మాత్రం క్లారిటీ లేకపోవడంతో తమ అభిమాన హీరో సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయో తెలియని అయెమయంలో ఫ్యాన్స్ ఉన్నారట. మరి ఈ ప్రాజెక్ట్‌లపై ఎప్పటికి క్లారిటీ వస్తుందో తెలియాలంటే మరి కొన్ని నెలలు వేచి చూడాల్సిందే.
