'స్పిరిట్' కోసం జపాన్, రష్యాలో ట్రైనింగ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్ ' పనులు వేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 9 Jun 2025 1:45 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్ ' పనులు వేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇదీ సందీప్ మార్క్ ఎంటర్ టైనర్ గా రూపొందుతుంది. ఈ సినిమా తర్వాత డార్లింగ్ ఇమేజ్ కూడా మారిపోతుంది. 'యానిమల్' డోస్ ని మించి హీరో రోల్ ఉండబోతుంది? అన్నది వాస్తవం. ఐదడుగుల రణబీర్ కపూర్ నే ఆ రేంజ్ లో హైలైట్ చేసాడంటే? ఏడు అడుగుల ప్రభాస్ ని ఇంకే రేంజ్ లో చూపిస్తాడో? ఊహకి కూడా అందదు.
హీరో క్యారక్టరైజేషన్ విషయంలో తిరిగి చూసే పనిలేదు. ఇప్పటికే కాఫ్ రోల్ పోషిస్తున్నట్లు లీక్ చేసాడు సందీప్. ఆ రోల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్పాడు. సామాన్య మానవుడి పాత్రనే పవర్ పుల్ గా డిజైన్ చేసే సందీప్ రక్షణ అధికారాలున్న పోలీస్ పాత్రను ఇంకే రేంజ్ లో లేపుతాడో ఊహకే వదిలేయాలి. తాజాగా డార్లింగ్ రోల్ కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. 'స్పిరిట్' లో ప్రభాస్ మొత్తం మూడు పాత్రలు పోషిస్తాడని టాక్ వినిపిస్తుంది.
పోలీస్ పాత్రతో పాటు లవర్ బోయ్, గ్యాంగ్ స్టర్ రోల్ పోషిస్తున్నాడట. గ్యాంగ్ స్టర్ల రోల్ కు సంబంధించి విదేశాల్లో స్పైషల్ ట్రైనింగ్ కూడా ప్లాన్ చేసాడట. ప్రభాస్ లైనప్ లో ఉన్న చిత్రాలు పూర్తి చేసిన వెంటనే ఆ పాత్రకు సంబంధించి శిక్షణ కోసం జపాన్ వెళ్లనున్నాడట. అక్కడ ట్రైనింగ్ పూర్తయిన వెంటనే రష్యా లో కూడా అదే పాత్రకు మరికొంత శిక్షణ తీసుకుంటాడని సమాచారం.
ఇదే నిజమైతే? ప్రభాస్ కూడా రికార్డు పుట్టలోకి ఎక్కినట్లే. ఇంతవరకూ ప్రస్తుత జనరేషన్ హీరోల్లో ఎవరూ త్రిపాత్రాభినయం ప్రయత్నిం చలేదు. బన్నీ 22లో ఆ ఛాన్స్ తీసుకుంటున్నట్లు ప్రచారంలో ఉంది. ఆ విషయాన్ని మేకర్స్ ధృవీకరించాలి. అదే జరిగితే బన్నీ పేరిట ఆ రికార్డు ముందుగా నమోదవుతుంది. ఎందుకంటే స్పిరిట్ కంటే ముందే బన్నీ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి రెండవ స్థానంలో ప్రభాస్ నిలుస్తాడు.
