Begin typing your search above and press return to search.

హోంబలేతో మూడు ప్రాజెక్ట్ లు అందుకే ఒప్పుకున్న : ప్రభాస్

సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు హీరోలతో మంచి రిలేషన్ షిప్ మెయింటెన్ చేస్తుంటారు. ముఖ్యంగా టాప్ హీరోలతో ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఉంటారు

By:  Tupaki Desk   |   16 July 2025 11:11 PM IST
హోంబలేతో మూడు ప్రాజెక్ట్ లు అందుకే ఒప్పుకున్న : ప్రభాస్
X

సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు హీరోలతో మంచి రిలేషన్ షిప్ మెయింటెన్ చేస్తుంటారు. ముఖ్యంగా టాప్ హీరోలతో ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఉంటారు. ఎందుకంటే ఫలానా హీరోతో సినిమా ఓకే అయితే తమ ప్రొడక్షన్ కంపెనీకి మంచి లాభాలు వస్తాయని ఆశ. ఈ విధానం టాలీవుడ్ లోనూ ఉంది. కొందరు ప్రొడ్యూసర్లు తమ బ్యానర్లలో నచ్చిన హీరోలతో వరుస ప్రాజెక్ట్ లు చేస్తుంటారు.

అయితే కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ రెబల్ స్టార్ తో ఇప్పటికే సలార్ సినిమా రూపొందించింది. 2023లో రిలీజైన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.700+ కోట్లు సాధించింది. ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ హోంబలే ఫిల్మ్స్ కు అర్థమైనట్లుంది. దీంతో ఇటీవల బోంబలే ప్రభాస్‌తో ఒకేసారి 3 సినిమాలు చేయబోతున్నట్లు సాలిడ్ ప్రకటన చేసింది.

ఈ మూడింట్లో సలార్- 2 కూడా ఉందని తెలిపింది. అయితే ప్రభాస్ లాంటి బడా స్టార్ ఒకే ప్రొడక్షన్ హౌస్ తో మూడు సినిమాలు చేయడం అప్పట్లో బ్రేకింగ్ అయ్యింది. పెద్ద హీరోలెవరూ ఇలా ఒకే బ్యానర్ తో పలు సినిమాలకు కమిట్ అవ్వరని, ప్రభాస్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారోనని తెగ చర్చ నడించింది. అయితే రీసెంట్ గా దీనిపై ప్రభాస్ స్పందించారు. ఆయనే స్వయంగా దీని గురించి వెల్లడించారు.

నిర్మాత విజయ్ కిరంగదుర్ నటుల పట్ల ఎంతో కేర్ తీసుకుంటారని ఆయన దగ్గర ఉన్న ఆ గుణమే హోంబలేలో సినిమాలు చేసేలా చేస్తుందని ప్రభాస్ అన్నారు. విజయ్ తన చుట్టూ ఉన్న వాళ్లను కేరింగ్ గా చూసుకుంటారు. సలార్ సినిమా నుంచే మేం ఫ్యామిలీ మెంబర్స్ లా మారిపోయాం. ఆయనా నాలాగే చిన్ననాటి మిత్రులతోనే ఉంటారు. ప్రొఫెషనల్ గా కూడా క్వాలిటీలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు.

కాంతార, కేజీఎఫ్ ప్రాజెక్ట్ ల విషయంలోనే నాకు ఇది తెలుసు. నా సినిమాలకు క్వాలిటీ ముఖ్యం. ఆయన కూడా ఇందులో రాజీ పడరు. బడ్జెట్ ఎక్కువైనా, టీమ్ కు భరోసా ఇస్తూ, బడ్జెట్ గురించి టెన్షన్ పడొద్దని చెబుతుంటారు. ఈ క్వాలిటీస్ అన్నీ నాకు నచ్చాయి. ఇలాంటి వాళ్లతో రిలేషన్ ఎక్కువ రోజులు కొనసాగించాలని అనుకుంటాను. ఈ కారణంగానే మూడు సినిమాలు చేసేందుకు ఓకే చెప్పాను. అని ప్రభాస్ చెప్పారు. అయితే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ఒక్కరే ఇలా ఒకే ప్రొడక్షన్ హౌస్కు కమిట్ అవుతారు.