Begin typing your search above and press return to search.

'ది రాజాసాబ్‌' కోసం బాలీవుడ్ క్లాసిక్ సాంగ్‌..కానీ!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన భారీ కామెడీ హార‌ర్ థ్రిల్ల‌ర్ `ది రాజాసాబ్‌`. మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా టీజ‌ర్ ఎట్ట‌కేల‌కు రిలీజ్ కావ‌డం తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 Jun 2025 12:51 PM IST
ది రాజాసాబ్‌ కోసం బాలీవుడ్ క్లాసిక్ సాంగ్‌..కానీ!
X

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన భారీ కామెడీ హార‌ర్ థ్రిల్ల‌ర్ 'ది రాజాసాబ్‌'. మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా టీజ‌ర్ ఎట్ట‌కేల‌కు రిలీజ్ కావ‌డం తెలిసిందే. గ‌త కొంత కాలంగా ఆల‌స్యం అవుతూ వ‌చ్చిన టీజ‌ర్ ఫైన‌ల్‌గా ప్రేక్ష‌కుల ముంతుకు వ‌చ్చేసింది. క‌ళ్లు చెదిరే విజువ‌ల్స్‌, డార్లింగ్ ప్ర‌భాస్ మార్కు కామెడీ పంచ్‌లు, మారుతి మార్కు కామెడీ హార‌ర్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సినిమా టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌తో పాటు అభిమానుల్ని కూడా విశేషంగా ఆక‌ట్టుకుంటూ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

ఇందులోని కీల‌క పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ సంజ‌య్‌ద‌త్ న‌టించారు. ఆయ‌న ప్ర‌భాస్‌కు తాత‌గా ఓ మ‌హ‌ల్‌ని ఆవ‌హించిన ఘోస్ట్ క్యారెక్ట‌ర్‌లో సంజ‌య్‌ద‌త్ క‌నిపించ‌బోతున్నారు. ప్ర‌భాస్ సీరిస్ టోన్‌ని వీడి కామెడీ పంచ్‌ల‌తో త‌న‌దైన మార్క్ హాస్యంతో అల‌రించ‌బోతున్నార‌ని టీజ‌ర్‌తో స్ప‌ష్ట‌మైంది. ఇక ఇందులో ప్ర‌భాస్‌కు జోడీగా ముగ్గురు ముద్దుగుమ్మ‌లు న‌టించారు. మాళ‌విక మోహ‌న‌న్‌, నిధి అగ‌ర్వాల్‌, రిద్ధి కుమార్ ఈ మూవీలో ప్ర‌భాస్‌తో రొమాన్స్ చేస్తున్నారు.

అయితే ఈ మూవీ కోసం ప్ర‌భాస్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌ని ద‌ర్శ‌కుడు మారుతి ఓ రేంజ్‌లో ప్లాన్ చేశాడ‌ట‌. ఇందులో ప్ర‌భాస్‌తో పాటు ముగ్గురు హీరోయిన్‌లు కూడా ఉండేలా డిఐన్ చేశాడ‌ట‌. దీని కోసం బాలీవుడ్ క్లాసిక్ సాంగ్‌ని తీసుకుని దాన్నే రీమిక్స్‌గా వాడాల‌నుకున్నాడ‌ట‌. కానీ ఆడియో రైట్స్ గుర్తుకొచ్చి స‌ద‌రు బాలీవుడ్ క్లాసిక్ సాంగ్‌కు సంబంధించిన వారిని సంప్ర‌దిస్తే `రాజాసాబ్‌` టీమ్‌కు క‌ళ్లుబైర్లు క‌మ్మాయ‌ని తెలిసింది. స‌ద‌రు బాలీవుడ్ సంస్థ క్లాసిక్ సాంగ్ కోసం రైట్స్ రూపంలో రూ.5 కోట్లు డిమాండ్ చేసి షాక్ ఇచ్చింద‌ట‌.

దాంతో షాక్‌కు గురైన చిత్ర బృందం ఆ ఆలోచన‌లో ప‌డిన‌ట్టు తెలిసింది. ప్ర‌భాస్‌తో క‌లిసి ముగ్గురు హీరోయిన్‌లు డ్యాన్స్ చేసే ప్ర‌త్యేక సాంగ్ కాబ‌ట్టి క్లాసిక్ సాంగ్ ని తీసుకుంటే సినిమాకు హైలైట్ అవుతుంద‌ని భావిస్తే బాలీవుడ్ సంస్థ రూ.5 కోట్లు డిమాండ్ చేయ‌డంతో ఆ ఆలోచ‌న‌ని మేక‌ర్స్ విర‌మించుకున్నార‌ట‌. అంత మొత్తం ఇచ్చి మ‌ళ్లీ పాట రాయించుకొని, మ్యూజిక్ చేయించుకోవ‌డం ఎందుకు.. త‌మ‌న్ చేతే కొత్త పాట చేయిస్తే బాగుంటుంద‌ని భావించి ఆ బాధ్య‌త‌ల్ని మ‌ళ్లీ త‌మ‌న్‌కే అప్ప‌గించార‌ట‌. ఇలాంటి పాట‌ల్ని చేయ‌డంలో త‌మ‌న్ సిద్ధ‌మ‌స్తుడు కావ‌డంతో అనుకున్న స్థాయిలో ఈ పాట వ‌చ్చేసింద‌ని, థియేట‌ర్ల‌లో ఆడియ‌న్స్ ఈ పాట‌కు ఉర్రూత‌లూగ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.