Begin typing your search above and press return to search.

రాజాసాబ్ ఎంట్రీ కోసం అదిరిపోయే ప్లాన్!

ఇక తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది.

By:  Tupaki Desk   |   15 July 2025 1:00 PM IST
రాజాసాబ్ ఎంట్రీ కోసం అదిరిపోయే ప్లాన్!
X

ప్రభాస్‌ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమాపై మొదట్లో అంతగా అంచనాలు లేకపోయినా, ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇటీవల వచ్చిన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్‌లు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ప్రభాస్‌ నయా లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మాస్‌, కామెడీ, హారర్ కలయికలో దర్శకుడు మారుతి తీస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పై ఇప్పుడు భారీ బజ్ ఏర్పడింది.

ఇప్పటికే ప్రభాస్‌ కెరీర్‌లో వరుసగా భారీ పాన్ ఇండియా సినిమాలు ఉండగా, వీటన్నిటికీ భిన్నంగా ‘ది రాజాసాబ్’ డిఫరెంట్ హారర్ సినిమా కావడం విశేషం. ఇందులో నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌, రిధి కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్ సంజయ్‌ దత్ విలన్‌గా కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

ఇక తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. ప్రభాస్‌పై ఓ కీలక సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశం సినిమాకు ముఖ్యమైన భాగమని సమాచారం. త్వరలోనే ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ కోసం ప్రత్యేకంగా ఒక పాటను కూడా షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పాటకు థమన్ ఓ అదిరిపోయే ట్యూన్ ఇచ్చాడట.

అయితే, ఈ ఇంట్రడక్షన్ పాటలో ఓ హీరోయిన్ కూడా కనిపించనుందని టాక్. అంతా ఊహిస్తున్నట్లుగా కరీనా కపూర్‌, అలియా భట్‌లు మాత్రం ఈ పాటలో లేరట. మరి ఆ హీరోయిన్ ఎవరు? అనేది మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే ఉంచారు. ఈ సీక్రెట్ బయటపడ్డాక సినిమాపై మరింత హైప్ ఏర్పడే అవకాశం ఉంది.

దర్శకుడు మారుతి ప్రస్తుతం పూర్తిగా సినిమా మీదే ఫోకస్ పెట్టి, త్వరగా షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్ 5న రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. ఆల్రెడీ వాయిదాలు వచ్చిన నేపథ్యంలో ఈసారి జాప్యం లేకుండా పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. విజువల్స్‌, కామెడీ, సాంగ్స్‌తో కలిపి ఓ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా మలిచే ప్రయత్నం చేస్తున్నారు.

మొత్తానికి, ‘ది రాజాసాబ్’ మొదటి సమయంలో అంచనాలు తక్కువగా ఉన్నా.. ఇప్పుడు మాత్రం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీగా మారిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్‌, కొత్త పాట వివరాలు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే.. సీక్వెల్ కూడా లైన్ లోకి వస్తుందని ముందే ఓ హింట్ అయితే ఇచ్చారు.