హాలీవుడ్ సినిమాలకు పోటీగా రాజా సాబ్ క్లైమాక్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో చేస్తున్న హార్రర్ కామెడీ మూవీ ది రాజా సాబ్.
By: Tupaki Desk | 6 Jun 2025 7:00 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో చేస్తున్న హార్రర్ కామెడీ మూవీ ది రాజా సాబ్. ఈ సినిమాలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమాకు ఉన్న మేజర్ ప్లస్ పాయింట్స్ లో దీని జానర్ ముందుంటుందని చెప్పాలి.
దానికి కారణం ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనింగ్ రోల్ ను చేసి చాలా కాలమే అయింది. తెలుగు ఆడియన్స్ కు కాకుండా మిగిలిన అందరికీ ప్రభాస్ అంటే హై యాక్షన్ హీరోగా మాత్రమే తెలుసు. ప్రభాస్ గత సినిమాల్లో ఉండే కామెడీ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ వాళ్లు చూసే అవకాశాలు తక్కువ. అలాంటి ప్రభాస్ నుంచి మొదటి సారి మంచి ఎంటర్టైనింగ్ తో పాటూ థ్రిల్లింగ్ సీన్స్ కలిగిన సినిమా రాబోతుంది.
ఇప్పటికే రాజా సాబ్ సినిమాలో సీజీఐ భారీగా ఉంటుందని మేకర్స్ చెప్పగా, ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలుస్తోంది. రాజా సాబ్ సినిమాలో క్లైమాక్స్ అందరినీ ఆకట్టుకుంటుందని చెప్తున్నారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ అన్నీ కలిపి సుమారు 30 నిమిషాల పాటూ ఉంటాయని, ఈ రెండూ కూడా చాలా భారీ వీఎఫ్ఎక్స్ తో కూడి ఉంటాయని సమాచారం.
ఇండియన్ సినిమాల్లో ఇది చాలా రేర్ గా కనిపిస్తుంది. ఈ విజువల్ ట్రీట్ రాజా సాబ్ కు మెయిన్ హైలైట్ కానుందని అందరూ తెగ చెప్తున్నారు. ఈ క్లైమాక్స్ సీజీఐ వర్క్ అనుకున్నది అనుకున్నట్టు వర్కవుట్ అయితే హాలీవుడ్ సినిమాలకు పోటీగా నిలిచే రేంజ్ లో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. దీని కోసం ఓ ప్రముఖ వీఎఫ్ఎక్స్ కంపెనీకి చిత్ర యూనిట్ ఆ బాధ్యతల్ని అప్పగించినట్టు తెలుస్తోంది. రాజా సాబ్ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుండగా, జూన్ 16న టీజర్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ గెటప్ లో కనిపించనున్నాడనే సంగతి తెలిసిందే.
