Begin typing your search above and press return to search.

రికార్డులే టార్గెట్ గా రాజాసాబ్..?

రాజా సాబ్ సినిమాకు థమన్ మ్యూజిక్ సంథింగ్ స్పెషల్ కానుంది. ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ కి ఉన్న డౌట్స్ అన్నీ కూడా టీజర్ తో క్లియర్ అవుతాయని.

By:  Tupaki Desk   |   10 Jun 2025 3:00 AM IST
రికార్డులే టార్గెట్ గా రాజాసాబ్..?
X

రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ నుంచి వస్తున్న అప్డేట్స్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాయి. త్వరలో టీజర్ ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రిలీజ్ డేట్ కూడా తెలిసింది. ఇలా వరుస అప్డేట్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ఇన్నాళ్లు రాజా సాబ్ మీద చూపించిన అసంతృప్తి అంతా పోయింది. డిసెంబర్ ఫస్ట్ వీక్ రిలీజ్ అవుతున్న ప్రభాస్ రాజా సాబ్ సినిమా భారీ రికార్డుల మీద టార్గెట్ పెట్టాడని తెలుస్తుంది. థ్రిల్లర్ జోనర్ లో రాబోతున్న రాజా సాబ్ సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఉన్నాయని తెలుస్తుంది.

సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. సలార్ 1, కల్కి 2898 ఏడి కన్నా రాజా సాబ్ తో ఎక్కువ వసూళ్లు చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రభాస్ సినిమా అంటే నార్త్ సైడ్ ఆడియన్స్ లో ఒక విపరీతమైన బజ్ ఉంటుంది. రాజా సాబ్ నుంచి ఇప్పటివరకు ఒక మోషన్ పోస్టర్ మాత్రమే వచ్చింది. నెక్స్ట్ టీజర్ తో అంచనాలు డబుల్ చేయాలని చూస్తుంది.

బాహుబలి ప్రభాస్ కాబట్టి ఏది ఎలా ఉన్నా రిలీజ్ టైం కు ఆ హై కచ్చితంగా వస్తుంది. ఇక సినిమా ఏమాత్రం అంచనాలకు తగినట్టు ఉన్నా కూడా నెక్స్ట్ లెవెల్ రికార్డులు సాధిస్తుంది. కచ్చితంగా పాన్ ఇండియా లెవెల్ లో రాజా సాబ్ వసూళ్ల మోత మోగుతుందని చెప్పొచ్చు. రాజా సాబ్ మూవీ లో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. నిధి అగర్వాల్ కూడా మరో కథానాయికగా నటిస్తుందని తెలిసిందే.

రాజా సాబ్ సినిమాకు థమన్ మ్యూజిక్ సంథింగ్ స్పెషల్ కానుంది. ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ కి ఉన్న డౌట్స్ అన్నీ కూడా టీజర్ తో క్లియర్ అవుతాయని. ఆ నెక్స్ట్ ఇక సినిమా రిలీజ్ తో రికార్డులు సృష్టిస్తుందని అంటున్నారు. ప్రభాస్ రాజా సాబ్ సినిమా ఇప్పటివరకు జరిగింది పక్కన పెడితే ఈ ఆరు నెలల్లో సినిమాకు కావాల్సినంత బజ్ తెచ్చేలా సూపర్ ప్రమోషన్స్ చేస్తారని తెలుస్తుంది. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ సినిమా తర్వాత హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లేదా సెకండ్ హాఫ్ రిలీజ్ ప్లానింగ్ ఉంది. దీనితో పాటు సందీప్ వంగ డైరెక్షన్ లో ప్రభాస్ స్పిరిట్ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది.