8 గంటల షిఫ్ట్ అనేది సాధారణం.. మేము 16-18 గంటలు కూడా వర్క్ చేశాం!
మారుతి డైరెక్షన్‌లో తొలిసారి ప్రభాస్ అనగానే అంతా అవాక్కయ్యారు. మారుతితో ప్రభాస్ సినిమా ఏంటీ? అని కానీ మారుతిపై ఉన్న నమ్మకంతో ఆయన `ది రాజాసాబ్` చేశాడట.
By: Tupaki Desk | 16 Jun 2025 4:16 PM ISTమారుతి డైరెక్షన్‌లో తొలిసారి ప్రభాస్ అనగానే అంతా అవాక్కయ్యారు. మారుతితో ప్రభాస్ సినిమా ఏంటీ? అని కానీ మారుతిపై ఉన్న నమ్మకంతో ఆయన `ది రాజాసాబ్` చేశాడట. తనే మారుతితో హారర్ కామెడీ చేయాలని ఉందని చెప్పి మరీ ఈ సినిమా చేసినట్టుగా దర్శకుడు మారుతి టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వెల్లడించడం గమనార్హం. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ వంటి ముగ్గురు గ్లామరస్ డాల్స్ ఇందులో హీరోయిన్‌లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ ఇంత వరకు చేయని భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 5న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే టీజర్ ని మేకర్స్ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్‌లో పాల్గొన్న దర్శకుడు మారుతి `ది రాజా సాబ్`కు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాల్ని మీడియాతో పంచుకున్నారు. టీజర్‌తో సినిమా ఎలా ఉండబోతోంది? విజువల్స్ ఏ స్థాయిలో ఉండనున్నాయని క్లారిటీ ఇచ్చేసిన మారుతి ఈ సినిమా షూటింగ్‌లో ప్రభాస్ ఎలా ఉండేవారు, సీక్వెల్ ఉంటుందా? ప్రభాస్‌పై ఇంట్రో సాంగ్ ఎలా ఉంటుంది? అందులో ఎంత మంది హీరోయిన్‌లు ప్ఱభాస్‌తో కలిసి కనిపిస్తారు? వంటి ఆసక్తికర విషయాల్ని తెలిపారు.
సినిమాలో ప్రభాస్‌పై ఎంట్రీ సాంగ్ ఉంటుంది. ఇందులో ముగ్గురు హీరోయిన్‌లు ఉంటారు. ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ ఎలాంటి సాంగ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తారో అదే స్థాయిలో ఈ సాంగ్ ఉంటుంది. ఇది హీరో ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్. ప్రభాస్ షూటింగ్ సమయంలో సెట్‌కు వస్తే నాకు ఓ పిక్నిక్‌లా అనిపిస్తోందని, జీరో స్ట్రెస్ డార్లింగ్ అని చెబుతుండే వారు. సినిమా కూడా ఆయన చెప్పినట్టుగానే ఉంటుంది. ప్రతి సాంగ్‌ని ప్రేక్షకులు, అభిమానులు మామూలుగా ఎంజాయ్ చేయరు.
తమన్ ఈ సినిమాకు అల్టీమేట్ మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం తమన్ చాలా కష్టపడుతున్నాడు` అన్నారు. ఇక సినిమా రన్ టైమ్‌తో పాటు పార్ట్ 2పై కూడా క్లారిటీ ఇచ్చారు. సినిమా రన్ టైమ్ 3 గంటలు. సినిమా విడుదలయ్యాక పార్ట్ 2 గురించి ఆలోచిద్దాం. పార్ట్ 2 కోసం కథను సాగదీసి రుద్దను. కంగారు పడొద్దు. ఆ క్లారిటీ మాకుంది. నటీనటులకు సుమారు 8 గంటల షిఫ్ట్ అనేది సాధారణంగా ఉంటుంది. కానీ సినిమా కోసం మేము 18 గంటలు కూడా వర్క్ చేశాం. అందుకే ఇంత మంచి అవుట్‌పుట్ వచ్చింది` అన్నారు.
