Begin typing your search above and press return to search.

ఫైనల్లీ రాజా సాబ్ ఆగమనం.. ఫ్యాన్స్ హ్యాపీస్..!

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అంతా చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   2 Jun 2025 11:26 PM IST
ఫైనల్లీ రాజా సాబ్ ఆగమనం.. ఫ్యాన్స్ హ్యాపీస్..!
X

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అంతా చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న రాజా సాబ్ సినిమా సెట్స్ మీదకు వెళ్లి చాలా కాలం అయ్యింది. ఐతే సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా మేకర్స్ ఫ్యాన్స్ సహనానికి పరీక్ష పెట్టారు. రెబల్ స్టార్ ఫ్యాన్స్ అయితే రాజా సాబ్ దర్శక నిర్మాతల మీద సోషల్ మీడియా వేదికగా ఎటాక్ చేశారు. ఐతే ప్రతి దానికి ఒక టైం అంటూ ఉంటుంది కాబట్టి ఆ టైం వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే.

ఫైనల్ గా రాజా సాబ్ అప్డేట్స్ కి టైం వచ్చేసింది. లేటెస్ట్ గా మేకర్స్ రాజా సాబ్ సెలబ్రేషన్స్ రేపటి నుంచి మొదలు అంటూ ఉదయం 10:34 గంటలకు అప్డేట్ వస్తుందని అనౌన్స్ చేశారు. రెబల్ ఫ్యాన్స్ ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఈ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు రేపు రాబోయేది టీజర్ అనౌన్స్ మెంట్ డేట్ అని తెలుస్తుంది. జూన్ 12న రాజా సాబ్ టీజర్ ని రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఆ టీజర్ లో సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తారని టాక్.

రాజా సాబ్ సినిమా అసలైతే ఈ ఇయర్ సమ్మర్ రిలీజ్ అవ్వాల్సింది కానీ సినిమా పూర్తి కాకపోవడం వల్ల వాయిదా పడింది. ఐతే ఫైనల్ గా ఈ సినిమాను డిసెంబర్ రెండో వారం అంటే డిసెంబర్ 12న రిలీజ్ లాక్ చేస్తున్నారని తెలుస్తుంది. రెండేళ్ల క్రితం డిసెంబర్ లోనే ప్రభాస్ సలార్ 1 తో సత్తా చాటాడు. ఐతే ఈ క్రిస్ మస్ కి అడివి శేష్ డెకాయిట్ రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు. డెకాయిట్ క్రిస్ మస్ రావడం వల్ల ప్రభాస్ సినిమాను డిసెంబర్ 12కి తెస్తున్నారట.

మారుతి డైరెక్షన్ లో థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న రాజా సాబ్ ఆడియన్స్ కి ఒక స్పెషల్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు. స్టార్ హీరో ప్రభాస్ నుంచి ఇలాంటి ఒక సినిమా వస్తుందని ఎవరు ఊహించరు అన్నట్టుగా సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమాకు థమన్ అందిస్తున్న మ్యూజిక్ కూడా వన్ ఆఫ్ ది హైలెట్స్ గా ఉంటుందని అంటున్నారు.