Begin typing your search above and press return to search.

రాజాసాబ్ ఫస్ట్ ఈవెంట్ అక్కడే..

ప్రభాస్ నటిస్తున్న హారర్ ఎంటర్‌టైనర్ ది రాజాసాబ్ సినిమాపై ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.

By:  Tupaki Desk   |   19 July 2025 12:08 PM IST
రాజాసాబ్ ఫస్ట్ ఈవెంట్ అక్కడే..
X

ప్రభాస్ నటిస్తున్న హారర్ ఎంటర్‌టైనర్ ది రాజాసాబ్ సినిమాపై ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. మొదట్లో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోయినా, ఆ తరువాత విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియో సినిమాపై పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చాయి. ప్రభాస్ సరికొత్త గెటప్, మారుతి మార్క్ హారర్ - కామెడీ మిక్స్ చూసిన తర్వాత అభిమానుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది. ఈ సినిమాతో ప్రభాస్ మాస్ ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఆకట్టుకోవాలనే టార్గెట్‌లో ఉన్నట్టు అర్థమవుతోంది.

ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు మారుతి ప్రతి సన్నివేశాన్ని ఎంతో డిఫరెంట్ గా తీర్చిదిద్దుతున్నాడని టాక్. ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాలు, పాటల చిత్రీకరణ పూర్తయ్యాయి. త్వరలోనే ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్ కూడా షూట్ చేయనున్నారు. ఇందులో ఓ టాప్ హీరోయిన్ కూడా గెస్ట్‌గా కనిపించనుందని సమాచారం. సంగీత దర్శకుడు థమన్ ఈ పాటకు మంచి ట్యూన్ ఇచ్చాడట.

ఇక లేటెస్ట్ బజ్ ప్రకారం, నవంబర్ మూడో వారంలో అమెరికాలో ‘ది రాజాసాబ్’కు సంబంధించిన భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. యూఎస్‌లో ప్రభాస్‌కు మంచి ఫ్యాన్ బేస్ ఉండటంతో, అక్కడే మొదటి బిగ్ ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించాలని మేకర్స్ డిసైడ్ అయ్యారని సమాచారం. ఈ ఈవెంట్‌లో ప్రభాస్ పాల్గొనే అవకాశం కూడా ఉందని టాక్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దీనిపై పూర్తి ప్రణాళిక సిద్ధం చేస్తోందట.

ఈ ఈవెంట్ ద్వారా సినిమాపై బజ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇకపై ప్రచార కార్యక్రమాల్లో భాగంగా వరుసగా వీడియోలు, పోస్టర్లు, టీజర్లు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ చేసే దిశగా షూటింగ్ పూర్తిచేసే పనుల్లో బిజీగా ఉంది యూనిట్. ఈ సినిమా విజయం ప్రభాస్ కెరీర్‌కు కొత్త మలుపు తిప్పే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.

సలార్, కల్కి వంటి పెద్ద ప్రాజెక్టుల తర్వాత, కామెడీ, ఫ్యామిలీ హారర్ తరహాలో ‘రాజాసాబ్’ ఒక విభిన్నమైన ప్రయోగం అవుతుంది. త్వరలోనే ట్రైలర్‌తో పాటు మ్యూజిక్ ఆల్బమ్‌ను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక నవంబర్ ఈవెంట్ తర్వాత ‘ది రాజాసాబ్’పై వచ్చే హైప్‌తో సినిమా ఓపెనింగ్స్ మరింత భారీగా ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.