ప్రభాస్ కామెడీ..వారంతం అదే పనా!
ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో 'ది రాజాసాబ్' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 9 July 2025 9:00 PM ISTప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో 'ది రాజాసాబ్' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. డార్లింగ్ 'పౌజీ' షూటింగ్ తో పాటు ఏక కాలంలో రాజాసాబ్ చిత్రీకరణకు హాజరవుతున్నారు. ఇప్పటికే రాజాసాబ్ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. సింహభాగం షూటింగ్ పూర్తయింది. తాజాగా కొత్త షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. దీనిలో భాగంగా ప్రభాస్ తో పాటు, వీటీవీ గణేష్, ప్రభాస్ సీన్ పై కామెడీ ట్రాక్ తెరకెక్కిస్తున్నారు. ఈ వారంతం వరకూ షూటింగ్ అక్కడే జరుగుతుంది.
సినిమాలో ఈ కామెడీ ఎపిసోడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటున్నారు. ప్రభాస్ కామెడీ సైతం పండిచగల నటుడు. కెరీర్ ఆరంభంలో ప్రభాస్ నటించిన చాలా చిత్రాల్లో కామెడీ ట్రాక్ లో నూ కనిపించారు. కాల క్రమంలో భారీ యాక్షన్ థ్రిల్లర్ల వైపు వెళ్లడంతో కామెడీ కి పూర్తిగా దూరమయ్యారు. ఈనేపథ్యంలో మారుతి హారర్ థ్రిల్లర్ కామెడీ కథ వినిపించడంతో డార్లింగ్ మరో ఆలోచన లేకుండా కమిట్ అయ్యారు.
తాను పెద్ద పాన్ ఇండియా స్టార్ అయినా మారుతి ఇమేజ్ తో పనిలేకుండా కమిట్ అయ్యారు. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ విషయంలో మారుతి తొలుత కాన్పిడెంట్ గా లేకపోవడంతో సినిమా చేయకూడదనుకున్నాడు. కానీ ప్రభాస్ ఒత్తిడి తీసుకురావడంతో కమిట్ అయ్యారు. ఈ విషయాన్ని మారుతినే స్వయంగా ఓ సందర్భంలో రివీల్ చేసిన సంగతి తెలిసిందే. తాజా షెడ్యూల్ అనంతరం పాటల చిత్రీకరణ మొదలవు తుందని సమాచారం.
ఇందులో ముగ్గురు భామలు హీరోయిన్లగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరోయిన్ల పాత్రల విషయంలోనూ డార్లింగ్ హస్తముంది. సినిమాలో తొలుత ఒకే హీరోయిన్ అనుకున్నారు. కానీ మరో నాయిక ఉంటే బాగుంటుంద ప్రభాస్ సూచించడంతో? ఇద్దరు కాదు...ముగ్గురని రిద్ది కుమార్ ని థర్డ్ లీడ్ కి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
