Begin typing your search above and press return to search.

ది రాజాసాబ్: ఆ ఐడియాను పక్కనపెట్టి.. కొత్తగా కొడుతున్న తమన్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో ది రాజాసాబ్ ప్రత్యేక స్థానం దక్కించుకుంది.

By:  Tupaki Desk   |   18 Jun 2025 5:13 PM IST
ది రాజాసాబ్: ఆ ఐడియాను పక్కనపెట్టి.. కొత్తగా కొడుతున్న తమన్!
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో ది రాజాసాబ్ ప్రత్యేక స్థానం దక్కించుకుంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా హారర్ కామెడీ జానర్‌లో రూపొందుతోంది. ఇటీవల వచ్చిన టీజర్‌కు మంచి స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌లు హీరోయిన్‌లుగా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మాస్ మ్యూజిక్ కంపోజర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరగా, టాకీ పార్ట్ పూర్తయ్యింది. కేవలం రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఒకవేళ ఇవి కంప్లీట్ అయితే సినిమా పూర్తయినట్లే అవుతుంది. దీంతో డిసెంబర్ 5, 2025 న సినిమా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇంతలో ఓ ఆసక్తికరమైన మ్యూజిక్ అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. చిత్ర బృందం ఒక పాపులర్ హిందీ పాటను రీమిక్స్ చేయాలనుకుంది. అయితే ఆ పాటకు మ్యూజిక్ రైట్స్ ఉన్న సంస్థ రూ.5 కోట్లు డిమాండ్ చేయడంతో మేకర్స్ ఆశ్చర్యపోయారట. దీంతో ఆ ఐడియాను పూర్తిగా పక్కనపెట్టి.. ఇప్పుడు థమన్‌తోనే ఓ కొత్త పాటను కంపోజ్ చేయించాలని నిర్ణయించుకున్నారు. ఇది పూర్తిగా ఎనర్జిటిక్‌గా, హై లెవెల్‌లో ఉండే పాటగా రూపొందించనున్నట్లు సమాచారం.

ఈ పాటకు ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ కనిపించనున్నాడట. చాలా కాలం తర్వాత ప్రభాస్ ఫన్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా చేస్తున్న నేపథ్యంలో.. డైరెక్టర్ మారుతి ఈ పాటను ప్రత్యేకంగా డిజైన్ చేయించాలని భావిస్తున్నారు. పక్కా మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా హై వోల్టేజ్ స్టెప్పులతో ఈ పాటను తెరకెక్కించబోతున్నారు.

థమన్ కంపోజ్ చేసే పాటలకి ఎనర్జీ, మాస్ బీట్, కమర్షియల్ హైప్ ఉండేలా ఉంటుంది. సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ వంటి సినిమాల్లో తన సంగీతంతో మ్యాజిక్ చేసిన థమన్.. ఇప్పుడు ప్రభాస్ కోసం ఎలా కొత్తగా కొడతాడో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ పాట రాకతో సినిమా ప్రమోషన్ కూడా ఓ కొత్త లెవెల్‌కు చేరే అవకాశం ఉంది.

మొత్తానికి ది రాజాసాబ్ సినిమా కోసం తలపెట్టిన రీమిక్స్ ఆలోచన నుంచి వెనక్కి తగ్గిన మేకర్స్.. ఇప్పుడు పూర్తి బలంతో తమన్ స్టైల్ మ్యూజిక్ మీదే నమ్మకంతో ఉన్నారు. ఈ పాటలో ప్రభాస్ మ్యాజిక్ మరింతగా కనిపించేలా ఉండబోతోందన్న అంచనాలు మొదలయ్యాయి. మరి థమన్ కొట్టబోయే ఈ కొత్త పాట ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.