ఒకే ప్లేస్ లో ఇద్దరు స్టార్ హీరోస్.. ఎక్కడ, ఎందుకో తెలుసా?
అయితే ఇదే యూరప్ లో తమిళ నటుడు సూర్య సినిమా చిత్రీకరణ కూడా జరుపుకుంటుందట.
By: Madhu Reddy | 8 Oct 2025 9:00 PM ISTఅప్పుడప్పుడు కొన్ని విషయాలు యాదృచ్ఛికంగా అలా జరిగిపోతూ ఉంటాయి. అలా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కూడా ఓ ఇద్దరి స్టార్లు యాదృచ్ఛికంగా ఒకే దగ్గర షూటింగ్ జరుపుకుంటున్నారు. వాళ్లే తమిళ నటుడు సూర్య, టాలీవుడ్ నటుడు ప్రభాస్.. ఈ ఇద్దరు హీరోల సినిమా షూటింగ్స్ ప్రస్తుతం ఒకే దగ్గర జరుగుతుండడంతో వీరి సినిమా షూటింగ్లకు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారింది. ప్రభాస్ ప్రస్తుతం 'ది రాజా సాబ్' సినిమా షూటింగ్ కోసం ఈ మధ్యనే యూరప్ వెళ్ళినట్టు చిత్ర యూనిట్ అఫీషియల్ గా ఓ పోస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. యూరప్ లో ప్రభాస్,నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ లతో రెండు రొమాంటిక్ సాంగ్స్ చిత్రీకరించడం కోసం వెళ్లారు.
అయితే ఇదే యూరప్ లో తమిళ నటుడు సూర్య సినిమా చిత్రీకరణ కూడా జరుపుకుంటుందట. వెంకీ అట్లూరి డైరెక్షన్లో వస్తున్న సూర్య 46వ మూవీకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను యూరప్ లో చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. అలా తాజాగా ఈ రెండు సినిమా షూటింగ్స్ యూరప్ లో జరగడంతో ఈ విషయం కాస్త ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ గా మారింది.
ప్రభాస్ ది రాజా సాబ్ మూవీ విషయానికి వస్తే.. ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడ్డ ది రాజా సాబ్ మూవీని ఫైనల్ గా వచ్చే ఏడాది జనవరి 9న విడుదల చేయాలని చిత్ర యూనిట్ అధికారిక రిలీజ్ డేట్ ని కూడా రిలీజ్ చేసింది. ప్రస్తుతం మారుతి ఈ సినిమా షూటింగ్ ని శరవేగంగా జరుపుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ చాలా కొత్త లుక్ లో కనిపించబోతున్నట్టు ఇప్పటికే విడుదలైన టీజర్,ట్రైలర్ ద్వారా అర్థమవుతుంది. కామెడీ, హార్రర్,యాక్షన్ వీటన్నింటినీ ది రాజా సాబ్ మూవీలో చూడబోతున్నాం..అలా ప్రభాస్ ఈ సినిమాతో తనలోని కొత్త కోణాన్ని బయట పెట్టబోతున్నారు..
సూర్య 46 వ మూవీ విషయానికి వస్తే.. రీసెంట్ గానే రెట్రో మూవీతో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ ఈ హీరో తన నెక్స్ట్ మూవీ తోనైనా హిట్టు కొట్టాలనే ఆలోచనలో ఉన్నారు.అలా వెంకీ అట్లూరి డైరెక్షన్లో సూర్య తన 46వ సినిమాని చేస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా మమిత బైజు నటించగా.. సీనియర్ నటీమణులు రాధిక శరత్ కుమార్, రవీనాటాండన్ లు కీ రోల్స్ పోషిస్తున్నారు.
అలా భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలు యూరప్ లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోంది.. అలా యూరప్ లో ఓ కీలక షెడ్యూల్ తెరకెక్కుతున్నట్టు సమాచారం. సూర్య 46వ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయబోతున్నారు. అలా ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ సినిమాలు ఒకే దగ్గర షూటింగ్ జరుపుకోవడంతో పాటు వచ్చే ఏడాది అభిమానులను అలరించబోతున్నాయి.
