Begin typing your search above and press return to search.

కోలీవుడ్ న‌టుడి కోసం 'స్పిరిట్' పోల్!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో `స్పిరిట్` లాక్ అయిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 Jun 2025 3:00 PM IST
కోలీవుడ్ న‌టుడి కోసం స్పిరిట్ పోల్!
X

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో 'స్పిరిట్' లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇది ప్ర‌భాస్ కు 26వ చిత్ర‌మవుతుందా? 27వ చిత్ర‌మ‌వుతుందా? అన్న‌ది ఇంకా క్లారిటీ లేదు. 25వ చిత్రంగా `పౌజీ` తెరకెక్కుతోంది. అటుపై డార్లింగ్ కోసం సందీప్ రెడ్డి, నాగ్ అశ్విన్ వెయిట్ చేస్తున్నారు. వీళ్లిద్ద‌రిలో డార్లింగ్ ముందుగా ఎవ‌రికి డేట్లు ఇస్తారు? అన్న‌ది తెలియ‌దు.

అంత వ‌ర‌కూ 26వ సినిమా ఎవ‌రిది అవుతుంది అన్న‌ది చెప్ప‌లేని ప‌రిస్థితి. అయితే `స్పిరిట్` సినిమాలో ఓ పాత్ర మ‌త్రం స్ట్రాంగ్ గా కోలీవుడ్ న‌టుడిని డిమాండ్ చేస్తోందిట‌. ఆ భాష‌కు చెందిన న‌టుడు మాత్ర‌మే ఆ పాత్ర‌కు న్యాయం చేయ‌గ‌ల‌డ‌ని సందీప్ బ‌లంగా న‌మ్ముతున్నాడుట‌. దీంతో ఇప్పుడా ఛాన్స్ ఎవ‌రు అందు కుం టారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. సందీప్ సినిమాలో చిన్న ఛాన్స్ కోస‌మే క్యూలో ఉన్న న‌టులు ఎంతో మంది ఉన్నారు.

చిన్న రోల్ పోషించినా పాన్ ఇండియాలో వ‌చ్చే గుర్తింపు అలాంటిది. గ‌త సినిమా `యానిమ‌ల్` లో త‌మిళ న‌టుడు వీట‌వీ గ‌ణేష్ ఓ పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. అందులో ఆ రోల్ ఏ రేంజ్ లో స‌క్సెస్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు. పాన్ ఇండియాలోనే అత‌డు పేరు, చెప్పిన డైలాగ్ మారు మ్రోగింది. ఆ రోలే అత‌డికి ఓ ఐడెంటిటీలో మారిపోయింది. సందీప్ సినిమాలో పాత్ర‌ల‌న్న‌వి అంత బ‌లంగా ఉంటాయి.

ఈ నేప‌థ్యంలో `స్పిరిట్` లో ఛాన్స్ అందుకునే మరో త‌మిళ న‌టుడు ఎవ‌రు? అవుతారు అన్న‌ది ఆస‌క్తి క‌రంగా మారింది. సందీప్ మైండ్ లో ఉన్న ఆ న‌టుడు ఎవ‌రో గెస్ చేయాలంటూ సోష‌ల్ మీడియాలో పోలింగ్ పెట్టినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. ఇందులో హీరోయిన్ గా త్రిప్తీ డిమ్రీని ఫైన‌ల్ చేసిన సంగ‌తి తెలిసిందే.