'స్పిరిట్' పవర్ మెక్సికో నుంచి మొదలవుతుందా?
ప్రస్తుతం సందీప్ మెక్సికోలో ఉన్నాడు. 'స్పిరిట్' షూటింగ్ కోసం మెక్సికో అందాల్ని పరిశీలించడానికి వెళ్లాడు. తొలి షెడ్యూల్ అక్కడే మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడట.
By: Tupaki Desk | 1 April 2025 11:20 AM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా `స్పిరిట్` ఇప్పటికే పట్టాలెక్కించాలి. కానీ మధ్యలో 'పౌజీ' రావడంతో స్పిరిట్ ని పక్కనబెట్టారు. దీంతో పాటు 'రాజాసాబ్' కూడా ఆన్ సెట్స్ లో ఉండటం...సందీప్ రెడ్డి వంగా కూడా ఇన్ యాక్టివ్ గా ఉండటంతో 'స్పిరిట్' పనులు మొదలవ్వలేదు. ఈ నేపథ్యంలో వేసివి తర్వాత ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది.
అప్పటికి 'రాజాసాబ్' షూటింగ్ కూడా పూర్తవుతుంది? అన్న అంచనా నేపథ్యంలో సమ్మర్ తర్వాత ప్రభాస్ డేట్లు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. కానీ తాజా సమాచారం ప్రకారం 'స్పిరిట్' పట్టాలెక్కడానికి మరికొంత సమయం పడుతుందని సమాచారం. ప్రస్తుతం సందీప్ మెక్సికోలో ఉన్నాడు. 'స్పిరిట్' షూటింగ్ కోసం మెక్సికో అందాల్ని పరిశీలించడానికి వెళ్లాడు. తొలి షెడ్యూల్ అక్కడే మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడట.
మెక్సికో అంటే రెండు రకాల వాతావరణానికి అనుకూలిస్తుంది. వేడి..చల్లదనం గల రెండు ప్రత్యేకమైన ప్రాంతాలున్నాయి. ఆయా ప్రదేశాల్లో 'స్పిరిట్' తొలి షెడ్యూల్ మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ కథకు అక్కడి లోకేషన్ అయితే బాగుంటుందని సందీప్ ఇలా ప్లాన్ చేస్తున్నాడుట. మెక్సికో లొకేషన్ సెట్స్ హైదరాబాద్లో వేసి షూట్ చేసుకునే వెసులుబాటు ఉన్నా? ఒరిజినల్ లొకేషన్ లెక్క రాదని... వాస్తవ లొకేషన్ లో అయితే సీన్స్ పక్కాగా ఉంటాయని ఇలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే వచ్చే ఏడాది రణబీర్ కపూర్ 'యానిమల్' పార్క్ చేస్తానని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటికి 'స్పిరిట్' నుంచి పూర్తిగా బయటకు వస్తేనే సాధ్యమవుతుంది. లేదంటే 2026 లో 'యానిమల్' పార్క్ ఉండే ఛాన్స్ లేదు.
