ప్రభాస్ ప్లాన్.. ఈ డౌట్ తీరేదెప్పుడు?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 25 Jun 2025 2:00 AM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సలర్, కల్కి సినిమాలతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిన డార్లింగ్ మరికొన్ని డిఫరెంట్ కంటెంట్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. అయితే అతని ప్రాధాన్యత ఇప్పుడు కొత్త కథలకే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఇప్పటికే అతని చేతిలో నాలుగు సినిమాలు ఉండగా, ఏ సినిమా మొదలవుతుందో, ఏది డిలే అవుతుందో అన్నది అసలు డౌట్.
అయితే ఇందులో ఎక్కువగా చర్చకు వస్తున్న అంశం మాత్రం.. హిట్ సినిమాల సీక్వెల్స్. ప్రభాస్ గతంలోనే 'సలార్ 2'ని మొదలుపెట్టాలని ప్రణాళికలు సెట్ చేసుకున్నా, ఆ ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టి హను రాఘవపూడితో ఓ మిలిటరీ డ్రామా 'ఫౌజీ'కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దీంతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’పై తన పనిని తాత్కాలికంగా నిలిపి, ఎన్టీఆర్‌తో చేయబోయే కొత్త ప్రాజెక్ట్ పై ఫోకస్ చేశాడు.
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ఆ యాక్షన్ డ్రామా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 2026 జూన్‌లో విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇక ‘కల్కి 2898 ఎడి’ చిత్రం ఘన విజయం సాధించిన తర్వాత, దాని రెండవ భాగాన్ని కూడా త్వరగా మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ కూడా ఆలస్యానికి గురైంది.
ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు తన ఫోకస్‌ను సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందే 'స్పిరిట్' సినిమాపై పెట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలయ్యే అవకాశముంది..ఈ పరిస్థితుల్లో ప్రభాస్ తన సీక్వెల్స్ అయినా 'సలార్ 2', 'కల్కి 2' లను ఎప్పుడు పట్టాలెక్కిస్తాడో స్పష్టత రావాల్సి ఉంది.
రెండు చిత్రాలకూ మంచి క్రేజ్ ఉండడంతో పాటు భారీ స్థాయిలో అంచనాలు ఉండటంతో ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ ఈ రెండింటినీ విడిచిపెట్టకూడదనే అభిప్రాయంలో ఉన్నారు. ఇప్పటి వరకూ ప్రభాస్ ఏదైనా ఒక సీక్వెల్‌కు స్పష్టమైన కమిట్‌మెంట్ ఇవ్వలేదు. కానీ ‘స్పిరిట్’ తరువాత ఏ ప్రాజెక్ట్ పై ముందడుగు వేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.
