Begin typing your search above and press return to search.

ప్రభాస్ సినిమా కోసం ఆలిమ్‌ హకీమ్‌..!

By:  Tupaki Desk   |   31 Aug 2025 4:29 PM IST
ప్రభాస్ సినిమా కోసం ఆలిమ్‌ హకీమ్‌..!
X

పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ త్వరలో ది రాజాసాబ్‌, ఫౌజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆ సినిమాలు విడుదల కాక ముందే 'స్పిరిట్‌' సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి. అర్జున్‌ రెడ్డి, యానిమల్‌ సినిమాలతో పాన్‌ ఇండియా దర్శకుడిగా నిలిచిన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్‌ సినిమా రూపొందబోతుంది. ఈ సినిమా ప్రకటించి దాదాపు రెండు ఏళ్లు కాబోతున్నా ఇప్పటి వరకు కనీసం షూటింగ్‌ ప్రారంభం కాలేదు. ప్రభాస్ ఇతర కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉండటంతో పాటు, ఇతర కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. ఆలస్యం అవుతున్నా కొద్ది ఈ సినిమా వెయిట్‌ పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. సినిమా షూటింగ్‌ ప్రారంభం కోసం ప్రభాస్‌ అభిమానులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారు వెయిట్‌ చేస్తున్నారు.

సందీప్‌ వంగ దర్శకత్వంలో స్పిరిట్‌

స్పిరిట్‌ సినిమా షూటింగ్ ప్రారంభం ఎప్పుడు అనే విషయం ఇప్పటివరకు క్లారిటీ లేదు, కానీ రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో నటీనటుల గురించి, సాంకేతిక నిపుణుల గురించి, ఇంకా కథ, స్క్రీన్‌ప్లే గురించి కూడా ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారు, తమ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు సందీప్ రెడ్డి వంగ నుంచి ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో మొదట దీపికా పదుకునేను హీరోయిన్‌గా తీసుకున్న విషయం తెల్సిందే. కానీ కొన్ని కారణాల వల్ల ఆమెను తొలగించి ఆ స్థానంలో యానిమల్‌ హీరోయిన్‌ త్రిప్తి డిమ్రిని ఎంపిక చేయడం జరిగింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేస్తున్నారని, వర్క్ షాప్ సైతం నిర్వహిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దర్శకుడు త్వరలోనే పూర్తి వివరాలను వెళ్లడించే అవకాశాలు ఉన్నాయి.

ప్రభాస్ కి జోడీగా త్రిప్తి డిమ్రి

ఇక ఈ సినిమాలోని ప్రభాస్ లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ముఖ్యంగా ప్రభాస్ హెయిర్‌ స్టైల్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఈమధ్య కాలంలో ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్‌ ఆలిమ్‌ హకీమ్‌ పేరు బాగా వినిపిస్తుంది. ఆయన ఎంతో మంది హీరోలకు హెయిర్‌ స్టైల్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ సినిమా కోసం కూడా ఆయన్ను రంగంలోకి దింపేందుకు ఒప్పందాలు జరిగాయి. ప్రభాస్‌ను చాలా యూనిక్‌గా ఇప్పటి వరకు ఏ ఒక్కరూ చూపించన విధంగా, మరే సినిమాలో చూడని విధంగా ఆలిమ్‌ హకీమ్‌ చూపించేందుకు గాను ఇప్పటికే వర్క్ మొదలు పెట్టాడు అంటూ ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది. సందీప్ వంగ దర్శకత్వంలో గతంలో వచ్చిన సినిమాలకు ఆయన హెయిర్‌ స్టైలిస్ట్‌గా వర్క్ చేశాడు.

ఆలిమ్‌ హకీమ్‌ హెయిర్‌ స్టైల్‌..!

యానిమల్‌ సినిమాలో రణబీర్‌ కపూర్‌ యొక్క హెయిర్‌ స్టైల్‌ గురించి ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఆయన యొక్క లుక్‌కి విమర్శకుల ప్రశంసలు దక్కడంతో పాటు, రణబీర్‌ కపూర్‌ ను చాలా మంది అనుకరించడం మొదలు పెట్టారు. అందుకే ఆలిమ్‌ హకీమ్‌ యొక్క హెయిర్‌ స్టైల్‌తో ప్రభాస్ స్పిరిట్‌ సినిమాలో ఎలా కనిపిస్తాడు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజాసాబ్‌ సినిమాను వచ్చే ఏడాది జనవరి లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఫౌజీ సినిమా ఎప్పుడు వస్తుంది అనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాలు దేనికి అదే అన్నట్టుగా విభిన్నంగా ఉంటాయి అంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు.