సందీప్ లేకుండా హర్షవర్ధన్ మెప్పించగలడా?
యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో మరోసారి తన సత్తా చాటిన సందీప్ రెడ్డి వంగా, తన తర్వాతి సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేయనున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 10 April 2025 9:00 PM ISTయానిమల్ సినిమాతో బాలీవుడ్ లో మరోసారి తన సత్తా చాటిన సందీప్ రెడ్డి వంగా, తన తర్వాతి సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఇంకా స్పిరిట్ సినిమా మొదలు కాకుండానే ఈ మూవీపై విపరీతమైన బజ్ నెలకొంది. ఇదిలా ఉంటే యానిమల్ మూవీకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వరే స్పిరిట్ కు కూడా సంగీతాన్ని అందించనున్న సంగతి తెలిసిందే.
యానిమల్ తో ఆల్రెడీ వంగా తో ఓసారి వర్క్ చేసిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పుడు ప్రభాస్ స్పిరిట్ కోసం మరోసారి వర్క్ చేయనున్నాడు. యానిమల్ సినిమాలో డల్ సీన్స్ ను కూడా తన బీజీఎంతో నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాడు మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్. అలాంటి హర్షవర్ధన్ ఇప్పుడు ప్రభాస్ తో సందీప్ రెడ్డి చేయబోయే స్పిరిట్ కు ఎలాంటి మ్యూజిక్, బీజీఎం ఇస్తాడో అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే హర్షవర్ధన్, షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న కింగ్ సినిమాకు కూడా వర్క్ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అనిరుధ్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తాడని అంటున్నారు. అంటే హర్షవర్ధన్ కింగ్ మూవీ కోసం కేవలం సాంగ్స్ మాత్రమే ఇవ్వనున్నాడన్నమాట. మరి సందీప్ రెడ్డి లేకుండా హర్షవర్ధన్ ఆడియన్స్ కు గుర్తుండిపోయే మ్యూజిక్ ను ఇవ్వగలడా లేదా అనేది చూడాలి.
రీసెంట్ గా ఓ సందర్భంలో హర్షవర్ధన్ రామేశ్వర్ స్పిరిట్ సినిమా కు సంబంధించిన మ్యూజిక్ సెషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినట్టు వెల్లడించాడు. డిఫరెంట్ సౌండ్స్, మ్యూజిక్ ను అన్వేషిస్తూ, తన టీమ్ మహాబలిపురంకు కూడా వెళ్లిందని ఆయన తెలిపాడు. ఇక స్పిరిట్ సినిమా విషయానికొస్తే ఆ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
స్పిరిట్ లో ప్రభాస్ పోలీసాఫీసర్ గా కనిపిస్తాడని, గ్లోబల్ క్రైమ్ సిండికేట్ ను నిర్మూలించడానికి ఓ సాధారణ పోలీస్ ఏం చేశాడనే నేపథ్యంలో స్పిరిట్ కథ ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో మాస్, యాక్షన్, ఎమోషనల్ డ్రామా అన్నీ కలగలిపి ఉంటాయని, స్పిరిట్ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ను సందీప్ నెక్ట్స్ లెవెల్ లో డిజైన్ చేశాడని తెలుస్తోంది.
