Begin typing your search above and press return to search.

ఇకపై నో బ్రేక్.. స్పిరిట్ షూటింగ్ అప్పటి నుంచే..

ఇప్పుడు సెప్టెంబర్ లో షూటింగ్ ను ప్రారంభించేందుకు వంగా సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇకపై ఎలాంటి బ్రేక్ ఉండదని సమాచారం.

By:  Tupaki Desk   |   23 July 2025 10:12 AM IST
ఇకపై నో బ్రేక్.. స్పిరిట్ షూటింగ్ అప్పటి నుంచే..
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో స్పిరిట్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే మూవీ అనౌన్స్మెంట్ వచ్చిన నుంచి కూడా సినీ ప్రియులు, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందోనని అంతా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

అయితే చిత్రీకరణ ఇప్పటికే మొదలు కావాల్సి ఉన్నా.. కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ ను కంప్లీట్ చేశారు సందీప్ వంగా. మరికొద్ది రోజుల్లో షూటింగ్ ను కూడా మొదలుపెట్టనున్నారు. చిత్రీకరణ కోసం ఇప్పటికే మెక్సికోలోని కొన్ని ప్రాంతాలను పరిశీలించామని, అక్కడే షూటింగ్‌ ప్రారంభిస్తామని ఇటీవల తెలిపారు.

ఇప్పుడు సెప్టెంబర్ లో షూటింగ్ ను ప్రారంభించేందుకు వంగా సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇకపై ఎలాంటి బ్రేక్ ఉండదని సమాచారం. ఎందుకంటే.. ఇప్పటికే రాజా సాబ్ సెట్స్ లోకి ప్రభాస్ మళ్లీ అడుగుపెట్టారట. శరవేగంగా ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తున్నారని వినికిడి. డిసెంబర్ 5వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది ఆ చిత్రం.

ఆ సినిమా కంప్లీట్ అయిన వెంటనే.. స్పిరిట్ మూవీ షూటింగ్ మొదలవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. వెయిటింగ్ ఫర్ అప్డేట్స్ అంటూ సందడి చేస్తున్నారు. సినిమా కోసం వేయి కళ్లతో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని అంటున్నారు.

కాగా, స్పిరిట్ మూవీలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. నెవ్వర్ బిఫోర్ లుక్ లో సందడి చేయనున్నారు. వంగా ఇప్పటికే ఇచ్చిన ఎలివేషన్స్ తో డార్లింగ్ రోల్ పై భారీ బజ్ క్రియేట్ అయింది. ఇక హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ సందడి చేయనుంది. టాలీవుడ్ డెబ్యూతో లక్ టెస్ట్ చేసుకోనుంది.

భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ప్రణయ్ రెడ్డి నిర్మిస్తున్న స్పిరిట్ మ్యూజిక్ వర్క్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం సమకూరుస్తున్నారు. కొన్ని సాంగ్స్ కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన అప్డేట్స్ ను వంగా ఇచ్చిన విషయం తెలిసిందే. మరి స్పిరిట్ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో వేచి చూడాలి.