అలాగైతే 'పౌజీ'ని పక్కనబెట్టినట్లేనా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' పట్టాలెక్కితే గనుక డార్లింగ్ మరో సినిమా చేయడానికి వీలు లేదు.
By: Tupaki Desk | 11 July 2025 9:00 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' పట్టాలెక్కితే గనుక డార్లింగ్ మరో సినిమా చేయడానికి వీలు లేదు. ఇది సందీప్ కండీషన్. ఆ కండీషన్ ప్రకారమే ప్రభాస్ కమిట్ అయ్యాడు. ఒకేసారి రెండు..మూడు సినిమా షూటింగ్ లు చేస్తానంటే సందీప్ దగ్గర కుదరదు. సందీప్ కూడా ఇక్కడ రాజమౌళి రూల్ ని ఫాలో అవుతున్నాడు. తన ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకూ మరో సినిమా ఆలోచన లేకుండా పనిచేయాల్సిందే. ఆ రకంగానే ఇద్దరి మధ్య అగ్రిమెంట్ కుదిరింది.
ఈ నేపథ్యంలో 'పౌజీ' సినిమాను తాత్కాలికంగా డార్లింగ్ ఆపేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 'స్పిరిట్' షూటింగ్ సెప్టెంబర్ నుంచి మొదలవుతుందని ప్రచారం జరుగుతోంది. సందీప్ అప్పటికి ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుని సెట్స్ కు వెళ్లడానికి రెడీగా ఉంటాడు...ఈ క్రమంలో డార్లింగ్ కూడా తాజా షూట్స్ అన్ని పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజాసాబ్ గట్టెక్కినట్లే. ఆ సినిమా దాదాపు షూట్ పూర్తయింది. సెప్టెంబర్ కి మొత్తం పూర్తవుతుంది. కాబట్టి ఆ సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేదు.
కానీ 'పౌజీ' మాత్రం ఇంత వరకూ సగం మాత్రమే షూటింగ్ జరిగిందని సమాచారం. సెప్టెంబర్ నుంచి 'స్పిరిట్' మొదలైతే? గనుక 'పౌజీ' సెట్స్ కు వెళ్లడానికి అవకాశం ఉండదు. మళ్లీ అన్ని అనుకూలించిన తర్వాత అప్పుడు కూడా సందప్ రెడ్డి అంగీకరిస్తే? 'పౌజీ'ని రీస్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో 'పౌజీ' సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల టీమ్ ఎక్కడా నిరుత్సాహం చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈ విషయం పౌజీ టీమ్ కు ముందే తెలిసి ఉండొచ్చు.
ప్రభాస్ ప్రతీ సినిమాకు ఓ ప్రణాళిక ప్రకారమే డేట్లు ఇస్తున్నారు. 'పౌజీ'- 'స్పిరిట్' కి అలాగే కేటాయించారు. కాకపోతే పౌజీ గురించి విషయం బయటకు రాలేదు. 'పౌజీ' సినిమా అన్నది అనూహ్యంగా తెరపైకి వచ్చిన ప్రాజెక్ట్. అప్పటికప్పుడు ప్రభాస్ ఆ సినిమా కు డేట్లు కేటా యించినట్లు ప్రచారంలోకి వచ్చింది. కానీ దాని వెనుక ప్రీ ప్లానింగ్ అన్నది ముందే జరిగిందన్నది ప్రభాస్ సన్నిహితుల మాట.
