Begin typing your search above and press return to search.

స్పిరిట్ - మొత్తానికి ఓ పనైపోయింది!

ఇప్పుడు ప్రభాస్‌ను పోలీస్ గెటప్‌లో చూపించబోతున్నాడు. ఇది వంగాకు, ప్రభాస్‌కు కలిసొచ్చే క్రేజీ కాంబినేషన్‌గా పరిశ్రమ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

By:  Tupaki Desk   |   12 July 2025 11:30 AM IST
స్పిరిట్ - మొత్తానికి ఓ పనైపోయింది!
X

ప్రభాస్‌ పాన్‌ ఇండియా క్రేజ్‌తో సాగుతున్న సినిమాల లైన్‌లో ‘స్పిరిట్’ ప్రాజెక్ట్‌పై ప్రత్యేకమైన అంచనాలు ఉన్నాయి. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ డ్రామా సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొన్నది. ‘అర్జున్‌ రెడ్డి’, ‘కబీర్‌ సింగ్’, ‘యానిమల్’ వంటి సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న వంగా.. ఇప్పుడు ప్రభాస్‌ను పోలీస్ గెటప్‌లో చూపించబోతున్నాడు. ఇది వంగాకు, ప్రభాస్‌కు కలిసొచ్చే క్రేజీ కాంబినేషన్‌గా పరిశ్రమ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ప్రభాస్ ఈ సినిమాకి సెప్టెంబర్‌ నుండి పూర్తిగా డేట్స్ కేటాయించనున్నాడు. ఇప్పటికే 'రాజాసాబ్' షూట్‌ను ముగించేందుకు వేగంగా పనులు జరుపుతున్న ప్రభాస్, ఆ తర్వాత ‘స్పిరిట్’ కోసం పూర్తిగా డెడికేట్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. కాగా, ఇటీవల విడుదలైన అప్‌డేట్‌ ప్రకారం.. వంగా తన మ్యూజిక్‌ డైరెక్టర్ హర్షవర్ధన్‌ రమేశ్వర్‌తో కలిసి ఈ సినిమా మ్యూజిక్‌ పనులు పూర్తి చేశారట.

స్పిరిట్‌ సినిమాను మ్యూజికల్‌ బ్లాక్‌బస్టర్‌గా మలచాలని దర్శకుడు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కలిసి లక్ష్యంగా పెట్టుకున్నారట. ఇప్పటికే హర్షవర్ధన్‌ తన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో 'అర్జున్‌ రెడ్డి', 'యానిమల్' సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇప్పుడు స్పిరిట్‌ కోసం కూడా కంటెంట్ ఉన్న మ్యూజిక్‌తోనే ముందుకు వెళ్తున్నట్లు టాక్. ఈ సినిమాకు సంబంధించి పాటల కంపోజింగ్ పనులు పూర్తయ్యాయని తెలుస్తుండగా, ప్రస్తుతం లిరిక్స్, వోకల్స్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయట.

ఈ మ్యూజికల్ స్ట్రాటజీ వల్ల సినిమా నాన్ థియేట్రికల్ మార్కెట్‌ కూడా పవర్ఫుల్ గా ఉండే అవకాశం ఉంది. ప్రత్యేకంగా ప్రతి ఎమోషన్‌కు తగిన బీజీఎం ప్లాన్ చేయడం, కథనంలో మ్యూజిక్‌కు సెంటర్ స్టేజ్ ఇవ్వడం వంటి పాయింట్లపై సందీప్‌ చాలా సీరియస్‌గా పనిచేశాడట. ఇదే వంగా స్టైల్‌లో ఉండే మరో సినిమా కావడం వలన ‘స్పిరిట్’లోని సాంగ్స్, స్కోర్ భారీగా ఆకట్టుకుంటాయని యూనిట్ అంటోంది.

ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ రెండో వారం నుండి సినిమా రెగ్యులర్ షూట్‌ మొదలు పెట్టేందుకు టీమ్ సన్నాహాలు పూర్తి చేసింది. హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్ ప్లాన్ చేయగా, తర్వాత యూరప్‌లో మేజర్ పోర్షన్ షూట్ చేయనున్నారు. కథ మొత్తం పోలీస్ పాత్ర చుట్టూ తిరుగుతుందట. అందుకే ఇందులో ప్రభాస్ లుక్, నటన రెండూ కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. వంగా ఇప్పటికే లుక్‌ టెస్ట్‌లు కూడా పూర్తి చేశారట. మొత్తానికి ప్రభాస్‌ కెరీర్‌లో ఇదొక ముఖ్యమైన మూవీ అవుతుందనే మాట అభిమానుల్లో భారీ ఆసక్తి కలిగిస్తోంది.