ప్రభాస్ ‘స్పిరిట్’ కౌంట్‌డౌన్: లైనప్‌లో మార్పు లేదు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూసగున్నారో.ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
By: Tupaki Desk | 2 May 2025 9:55 AM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూసగున్నారో.ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతని లైనప్‌లో ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ సినిమాలు ఉన్నాయి. ‘స్పిరిట్’ సినిమా కోసం ఫ్యాన్స్ ఎక్కువగా ఎగ్జైట్ అవుతున్నారు. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో తెరకెక్కే ఈ కాప్ యాక్షన్ డ్రామా, ప్రభాస్‌ను ఇంటెన్స్ రోల్‌లో చూపించనుంది. ఈ సినిమా షూటింగ్, రిలీజ్ గురించి అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది.
అయితే, లైనప్‌లో మార్పులు ఉంటాయనే రూమర్స్ ఫ్యాన్స్‌ను కొంత టెన్షన్‌లో పడేశాయి. ‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది, ఇది సెప్టెంబర్ 2025లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ హారర్ కామెడీ జోనర్‌లో మారుతి డైరెక్షన్‌లో వస్తున్న సినిమా, ప్రభాస్‌ను డబుల్ రోల్‌లో చూపిస్తుంది. ఆ తర్వాత ‘ఫౌజీ’ హను రాఘవపూడి డైరెక్షన్‌లో 1940ల నేపథ్యంలో రూపొందుతోంది.
ఈ యాక్షన్ డ్రామా 2026లో రావొచ్చు. ప్రభాస్ షెడ్యూల్ బిజీగా ఉండటంతో ‘స్పిరిట్’ ఆలస్యం అవుతుందని కొందరు అనుకున్నారు. ఈ నేపథ్యంలో, ప్రభాస్ లైనప్ గురించి తాజా అప్‌డేట్ బయటకొచ్చింది. నిర్మాత భూషణ్ కుమార్ ‘స్పిరిట్’ సినిమా గురించి కీలక సమాచారం షేర్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ మరో 2-3 నెలల్లో మొదలవుతుందని, అంటే జూలై లేదా ఆగస్టు 2025లో స్టార్ట్ అవుతుందని కన్ఫర్మ్ చేశాడు.
అలాగే, ప్రభాస్ సినిమాల లైనప్‌లో ఎలాంటి మార్పులు లేవని, ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’ తర్వాత ‘స్పిరిట్’ రాబోతుందని క్లారిటీ ఇచ్చాడు. ఈ అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌లో టెన్షన్ తగ్గి, ఎగ్జైట్‌మెంట్ మళ్లీ పెరిగింది. ‘స్పిరిట్’ సినిమా టీ సిరీస్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. సందీప్ రెడ్డి వంగ స్టైల్‌లో ఇంటెన్స్ యాక్షన్, ఎమోషన్స్‌తో నిండి ఉంటుందని అంటున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ స్టైలిష్ కాప్ రోల్‌లో కనిపించనున్నాడు. హీరోయిన్‌గా ఒకరిద్దరు పేర్లు వినిపిస్తున్నా ఇంకా ఫైనల్ కాలేదు, విలన్‌గా అర్జున్ రాంపాల్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా 2026 సమ్మర్‌లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ ‘స్పిరిట్’ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మొత్తంగా, ప్రభాస్ లైనప్‌లో మార్పులు లేవని, ‘స్పిరిట్’ షూటింగ్ త్వరలో మొదలవనుందని తెలియడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’ తర్వాత ‘స్పిరిట్’తో బాక్సాఫీస్ షేక్ చేయడానికి ప్రభాస్ సిద్ధమవుతున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
