స్పిరిట్ ఫ్లాష్ బ్యాక్‌లో నెక్ట్స్ లెవెల్ ట్విస్ట్
ఈ రెండు సినిమాలను పూర్తి చేయగానే ప్రభాస్ ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్ ను మొదలుపెట్టి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.
By: Tupaki Desk | 1 Jun 2025 7:00 PM ISTప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ అనే సినిమాలో నటిస్తున్న ప్రభాస్ ఆ సినిమాను హార్రర్ కామెడీ నేపథ్యంలో చేస్తున్నాడు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవాల్సింది కానీ మధ్యలో ప్రభాస్ కు గాయమవడంతో షూటింగ్ కు బ్రేక్ పడి ఆలస్యమైంది.
ది రాజా సాబ్ తో పాటూ ప్రభాస్, సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో జరిగే ప్రేమ కథగా ఈ సినిమాను హను తెరకెక్కిస్తున్నాడు. ఇమాన్వీ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ను పరిశీలిస్తుండగా ఈ సినిమాలో ప్రభాస్ యుద్ధ సైనికుడిగా కనిపించనున్నట్టు సమాచారం.
ఈ రెండు సినిమాలను పూర్తి చేయగానే ప్రభాస్ ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్ ను మొదలుపెట్టి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్టు సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే రివీల్ చేయడంతో పాటూ స్పిరిట్ లో ప్రభాస్ రోల్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని హింట్ కూడా ఇచ్చాడు.
త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తవగా ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. స్పిరిట్ సెకండాఫ్ లో ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటూ ఎమోషనల్ సీక్వెన్స్ కూడా ఉంటాయని, దానికి తగ్గట్టే సెకండాఫ్ లో ప్రభాస్ క్యారెక్టర్ పై ఓ అద్భుతమైన ఫ్లాష్ బ్యాక్ ను సందీప్ ప్లాన్ చేశాడని, ఈ ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ క్యారెక్టర్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ ఈ విషయం మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే స్పిరిట్ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ను హర్షవర్ధన్ రామేశ్వర్ తో కలిసి సందీప్ రెడ్డి వంగా పూర్తి చేసేశాడు. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
