సందీప్ వంగాతో సినిమా అంటే రాసిచ్చేయాల్సిందే!
`రాజాసాబ్`, `పౌజీ` చిత్రాల తర్వాత `స్పిరిట్` చిత్రం పట్టాలెక్కాలి. అదే తొలుత ప్లానింగ్.
By: Tupaki Desk | 1 July 2025 7:00 AM IST`రాజాసాబ్`, `పౌజీ` చిత్రాల తర్వాత `స్పిరిట్` చిత్రం పట్టాలెక్కాలి. అదే తొలుత ప్లానింగ్. కానీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తనకు బాండ్ అయి పనిచేయాలి అనే నిబంధన ప్రభాస్ కు పెట్టడంతో ఆర్డర్ మారింది. తన తో సినిమా చేయాలంటే కేవలం తన ప్రాజెక్ట్ కు మాత్రమే పనిచేయాలని మరే చిత్రం చేయడానికి వీలు లేదని రాజమౌళి తరహాలో కండీషన్ పెట్టాడు. దీంతో ప్రభాస్ `కల్కి 2`కి డేట్లు ఇవ్వాల్సి వచ్చింది.
ఈ సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ప్రభాస్ ప్రీగా ఉన్నాడు అని అతని నుంచి క్లియర్ గా సమా ధానం వచ్చిన తర్వాత `స్పిరిట్` చిత్రం పట్టాలెక్కుతుంది. అప్పటి నుంచి డార్లింగ్ స్పిరిట్ కోసమే పని చేయాలి. మనసులో మరో పాత్ర రావడానికి వీలు లేదు. పూర్తిగా సందీప్ రెడ్డి వంగాకు కట్టుబడి పని చేయాల్సి ఉంటుంది. ఆరకంగా ప్రభాస్ కూడా ప్రణాళిక సిద్దం చేసి పెట్టుకున్నాడు.
సందీప్ రెడ్డి ఈ రూల్ ఇప్పుడే కాదు తొలి నుంచి అనుసరిస్తున్నదే. విజయ్ దేవరకొండతో `అర్జున్ రెడ్డి` చేసాడు. ఆ సమయంలో విజయ్ `అర్జున్ రెడ్డి` మాత్రమే చేసాడు. మరే సినిమా చేయలేదు. అప్పటికి అతడికి అవకాశాలు కూడా లేవనుకోండి. అటుపై ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో `కబీర్ సింగ్` టైటిల్ తో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో షాహిద్ కపూర్ నటించాడు. షాహిద్ కూడా ఈ సినిమా చేస్తోన్న సమయంలో మరో సినిమా కమిట్ అవ్వలేదు. అప్పటికే షాహిద్ చేతిలో కొన్ని కమిట్ మెంట్లు కూడా ఉన్నాయి.
కానీ కబీర్ సింగ్ కథ నచ్చడంతో వాటన్నింటిని పక్కనబెట్టి మరీ చేసాడు. అలా సందీప్ - షాహిద్ అంత ఫోకస్ గా పని చేసారు కాబట్టే అక్కడ బ్లాక్ బస్టర్ కొట్టారు. అటుపై `యానిమల్` కోసం రణబీర్ తో పని చేసాడు. ఎంతో బిజీగా ఉన్నా? రణబీర్ ని కూడా తనవైపు తిప్పుకుని ఒక్క సినిమా చేసేలా చూసుకున్నా డు. అలా అక్కడా సందీప్ నిబంధనే పాటించాడు. `స్పిరిట్` విషయంలో సందీప్ ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నాడు. అందుకే డార్లింగ్ ప్రీగా దొరికే వరకూ వెయిట్ చేస్తానంటున్నాడు.
