మరో సినిమాను ఓకే చేసిన ప్రభాస్
అంతేకాదు, బాహుబలి లాంటి సినిమా తర్వాత ప్రభాస్ అన్నీ భారీ సినిమాలే చేస్తాడనుకుంటే ఎవరూ ఊహించని రీతిలో సినిమాలను ఓకే చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు ప్రభాస్.
By: Tupaki Desk | 22 April 2025 1:09 PM ISTబాహుబలి ఫ్రాంచైజ్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకోవడంతో పాటూ అదే రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్నాడు ప్రభాస్. అప్పటివరకు డార్లింగ్, యంగ్ రెబల్ స్టార్ గా ఉన్న ప్రభాస్ ఆ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారాడు. బాహుబలి తర్వాత నుంచి ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ విపరీతమైన హైప్ ను తెచ్చుకుని మంచి ఓపెనింగ్స్ అందుకున్న విషయం తెలిసిందే.
అంతేకాదు, బాహుబలి లాంటి సినిమా తర్వాత ప్రభాస్ అన్నీ భారీ సినిమాలే చేస్తాడనుకుంటే ఎవరూ ఊహించని రీతిలో సినిమాలను ఓకే చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన జానర్ చేయకుండా వస్తున్నాడు. సాహో, రాధేశ్యామ్, సలార్, కల్కి ఇవన్నీ ఆ కోవలోకి వచ్చేవే. ప్రస్తుతం కూడా ప్రభాస్ చేతిలో పలు సినిమాలున్నాయి.
మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఆ సినిమా హార్రర్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందుతుంది. ప్రభాస్ కెరీర్లోనే మొదటి సారి ఈ జానర్ లో నటిస్తున్నాడు. దీంతో పాటూ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.
ఇప్పటివరకు మైత్రీ బ్యానర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ ను ఫౌజీ సినిమా కోసమే పెడుతున్నారని కూడా వార్తలొస్తున్నాయి. ఫౌజీ తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాను చేయాల్సి ఉంది. ప్రభాస్ ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు సందీప్ రెడ్డి స్పిరిట్ ను పట్టాలెక్కించాలని చూస్తున్నాడు. వీటితో పాటూ ప్రభాస్ సలార్2, కల్కి2 సినిమాలను కూడా పూర్తి చేయాల్సి ఉంది.
ఈ లోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తాడని కూడా అంటున్నారు. కానీ దానిపై ఎలాంటి ప్రకటన ఇప్పటివరకు వచ్చింది లేదు. అయితే ఇప్పుడు ప్రభాస్ మరో సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. హను రాఘవపూడితో ఫౌజీ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఇంకో మూవీ చేయడానికి ప్రభాస్ తలూపాడాని తెలుస్తోంది. త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు కూడా వెల్లడి కానున్నాయి. స్టార్ హీరోలు ఒక సంవత్సరానికి ఒక సినిమా చేయడానికే కష్ట పడుతుంటే ప్రభాస్ మాత్రం వరుసపెట్టి సినిమాలను ఓకే చేసుకుంటూ లైన్ లో పెడుతున్నాడు.
