ఫైనల్‌గా పాన్ ఇండియా స్టార్ వచ్చేస్తున్నాడు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా మూవీస్ చేస్తూ క్షణం తీరికలేకుండా గడిపేస్తున్నారు.
By: Tupaki Desk | 14 May 2025 8:32 AMపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా మూవీస్ చేస్తూ క్షణం తీరికలేకుండా గడిపేస్తున్నారు. ఒక్కో సినిమాకు ఒక్కో డేట్స్‌ని అడ్జెస్ట్ చేస్తూ మునుపెన్నడూ లేని విధంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలని సెట్స్‌పైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మారుతి డైరెక్షన్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజి విశ్వప్రసాద్ ఈ మూవీని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు టచ్ చేయని జానర్‌లో తొలిసారి ప్రభాస్ తన పంథాకు పూర్తి భిన్నంగా చేస్తున్న మూవీ ఇది.
కామెడీ హారర్ థ్రిల్లర్లని తెరకెక్కించడంతో దిట్టగా నిలిచిన మారుతి ఈ మూవీని కూడా హారర్ కామెడీగా రూపొందిస్తున్నారు. దర్శకుడిగా తన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో, ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టే సినిమా ఓ రేంజ్‌లో ఉంటుందని తెలుస్తోంది. కామెడీ హీరర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ రెండు విభిన్నమైన క్యారెక్టర్లలో కనిపించబోతున్నారు.
ఇక ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో తను ప్రభాస్‌కు తండ్రిగా కనిపిస్తాడా? లేక తాతగా కనిపించబోతున్నాడా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే ఆ మధ్య విడుదల చేసిన టీర్‌లో ప్రభాస్ ఓల్డ్ లుక్‌ని పరిచయం చేయడం తెలిసిందే. ఈ వీడియోని బట్టి సినిమాలో ప్రభాస్ ఓల్డ్ గెటప్‌లో ఘోస్ట్‌గా కనిపిస్తారని క్లారిటీ వచ్చేసింది. కీలక ఘట్టాల షూటింగ్ పూర్తి చేసుకున్నా కానీ ప్రభాస్, సంజయ్‌దత్‌లకు సంబంధించిన కీలక సన్నివేశాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయట.
దీనికి సంబంధించిన షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. సంజయ్ దత్ ప్రస్తుతం సిటీలో ఉన్నాడు. ఆయనకు సంబంధించిన షూటింగ్‌లో ప్రస్తుతం పాల్గొంటున్నాడు. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ కూడా త్వరలో పాల్గొనబోతున్నాడట. కొన్ని రోజులుగా వెకేషన్ కోసం ఇటలీ వెళ్లిన ప్రభాస్ ఈ మూవీ షూటింగ్ కోసం తిరిగి ఇండియా వస్తున్నాడని, వచ్చిన వెంటనే షూటింగ్‌లో పాల్గొంటాడని తెలిసింది. ఈ షూటింగ్‌లో పాల్గొంటూనే ప్రభాస్ తనకు సంబంధించిన డబ్బింగ్‌ను కూడా పూర్తి చేయబోతున్నాడట. ఆ తరువాతే టీజర్‌ని టీమ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా