Begin typing your search above and press return to search.

స‌ల్మాన్ ఖాన్, ప్ర‌భాస్, వ‌ర్మ‌ స్పూర్తితో యువ‌త‌!

బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్...టాలీవుడ్ లో ప్ర‌భాస్ స్టిల్ బ్యాచిల‌ర్స్. స‌ల్మాన్ ఖాన్ ఇక పెళ్లి చేసుకోడ‌ని తేలి పోయింది.

By:  Tupaki Desk   |   13 July 2025 5:00 PM IST
స‌ల్మాన్ ఖాన్, ప్ర‌భాస్, వ‌ర్మ‌ స్పూర్తితో యువ‌త‌!
X

బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్...టాలీవుడ్ లో ప్ర‌భాస్ స్టిల్ బ్యాచిల‌ర్స్. స‌ల్మాన్ ఖాన్ ఇక పెళ్లి చేసుకోడ‌ని తేలిపోయింది. ఇప్ప‌టికే ఆయ‌న వ‌య‌సు 59 ఏళ్లు. 40 ఏళ్ల కొడుకు ఉండాల్సిన వ‌య‌సులో పెళ్లి చేసుకుని ఇప్పుడు తాను ఉద్ద‌రించేది ఏముందుని ఓపెన్ గానే చెప్పేసారు. పెళ్లి చేసుకుని మ‌న‌స్ప‌ర్ద‌లు వ‌స్తే తిరిగి క‌ష్ట‌ప‌డి సంపాదించిందంతా భ‌ర‌ణంగా చెల్లించాలి. ఈ య‌వ‌సులో ఇదంతా అవ‌స‌ర‌మా? ఉన్న కుటుంబ స‌భ్యుల‌తో..ప‌ని వాళ్ల‌తో సంతోషంగా జీవితాన్ని సాగిస్తున్న‌ట్లు చెప్పుకొచ్చారు.

ప్రభాస్ మాత్రం పెళ్లి విష‌యంలో ఇంత ఓపెన్ గా ఎప్పుడూ మాట్లాడ‌లేదు. ప్ర‌భాస్ వ‌య‌సు కూడా 45 ఏళ్లు. ఆయ‌న పెళ్లి చేసుకుంటాడా? లేదా? అన్న‌ది డౌటే. పెళ్లి మాట ఎత్తితే స్కిప్ కొడుతుంటాడు. కృష్ణం రాజు ఉన్న స‌మ యంలోనే పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో? త‌న‌నే అడ‌గండ‌ని కొన్ని సంద‌ర్భాల్లో పెద్దాయ నా అస‌హ‌నం వ్య‌క్తం చేసారు. అప్పుడు సోష‌ల్ మీడియాలో ఆ అమ్మాయితో పెళ్లంట‌..ఈ అమ్మాయితో ఎంగేజ్ మెంట్ అని సోష‌ల్ మీడియాలో క‌థ‌నాలు త‌ప్ప ఇంత‌వ‌ర‌కూ ఏదీ లేదు.

మ‌రి ఇప్పటి యువ‌త వీళ్లిద్ద‌ర్నీ స్పూర్తి గా తీసుకుని పెళ్లిళ్లు చేసుకోవ‌డం లేదా? అంటే స‌న్నివేశం అలాగే క‌నిపిస్తుంది. వంద‌ల కోట్ల‌కు అధిప‌తులు వాళ్లే పెళ్లిళ్లు చేసుకోలేదు. జేబులో చిల్లి గ‌వ్వ‌లేదు పెళ్లి చేసుకుని ఏం చేద్దామ‌ని తిరిగి ప్ర‌శ్నిస్తోంది నేటి యువ‌త‌. వ‌ర్మ త‌ర‌హాలో లాజిక్ లు మాట్లాడుతున్నారు. ఈ మ‌ద్య కాలంలో చాలా మంది పెళ్లిళ్లు చేసుకోలేదు. 35-40 ఏళ్లు వ‌చ్చినా బ్యాచ్ ల‌ర్ బాబులు ఎక్కువ‌వుతున్నార‌ని ఎన్నో స‌ర్వేలు చెప్పాయి.

ఇందులో చాలా మంది మ‌హిళ‌లు కూడా ఉన్నారు. వీళ్లంతా పెళ్లి విష‌యంలో ఎవ‌రి కోణంలో వారు కార ణాలు చెబుతున్నారు. అవ‌న్నీ కూడా స‌బ‌బు గానే ఉన్నాయి. సోసైటీలో జ‌రుగుతోన్న ఘ‌ట‌న‌లు...వాళ్లు పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను ముడి పెడుతూ ఎంతో విలువైన స‌మాచార‌మే అందిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే పెళ్లి చేసుకోకుండా ప్ర‌భాస్, స‌ల్మాన్ ఖాన్ లా ప్ర‌శాంతమైన జీవితాన్ని గ‌డుపుతున్నార‌ని, తాము కూడా అలాగే ఉండాల‌ని కోరుకుంటున్ట‌న్లు తెలిపారు