ఫ్యాన్స్ కోరికను తీర్చిన మారుతి!
దీంతో తమ హీరోను రొమాంటిక్ యాంగిల్ లో చూడాలనే ఫ్యాన్స్ కోరిక ఎప్పటికప్పుడు ఆశగానే మిగులుతుంది.
By: Tupaki Desk | 17 Jun 2025 4:00 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లవ్ స్టోరీలు, రొమాంటిక్ మూవీస్ చేసి చాలా కాలమైంది. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రభాస్ తన సినిమాల్లో రొమాన్స్ కు ఎక్కువ చోటివ్వడం లేదు. గతంలో కూడా ప్రభాస్ సినిమాల్లో రొమాన్స్ టూ మచ్ గా ఎప్పుడూ లేదు. బాహుబలి తర్వాత ఆ కొంచెం కూడా తగ్గింది. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సినిమాల్లో రాధేశ్యామ్ తప్ప మరే సినిమాలోనూ రొమాంటిక్ యాంగిలనేదే ఉండదు.
దీంతో తమ హీరోను రొమాంటిక్ యాంగిల్ లో చూడాలనే ఫ్యాన్స్ కోరిక ఎప్పటికప్పుడు ఆశగానే మిగులుతుంది. ఫ్యాన్స్ తో పాటూ ప్రభాస్ కు కూడా మామూలు సినిమాలు చేసి బోర్ కొట్టినట్టుంది అందుకే రాజా సాబ్ లో కుదిరితే ఇద్దరు హీరోయిన్లను పెట్టమని ప్రభాసే అడిగాడని రాజా సాబ్ టీజర్ లాంచ్ లో డైరెక్టర్ మారుతి సరదాగా చెప్పిన సంగతి తెలిసిందే.
డార్లింగ్ అడిగితే ఏ డైరెక్టర్ అయినా కాదని అంటారా? ప్రభాస్ మాట మేరకు ఇద్దరేంటి ముగ్గురిని పెడదామని మారుతి రాజాసాబ్ లో ఏకంగా ముగ్గురు హీరోయిన్లను పెట్టాడు. కేవలం హీరోయిన్లను పెట్టడమే కాదు, వారిని నెక్ట్స్ లెవెల్ లో గ్లామరస్ గా చూపించాడు మారుతి. రాజా సాబ్ టీజర్ చూశాక సినిమాలో గ్లామర్ నెక్ట్స్ లెవెల్లో ఉండటం ఖాయమని అర్థమవుతుంది.
నిధి అగర్వాల్, మాళవిక మోహన్ తో పాటూ రిద్ధి కుమార్ ను హీరోయిన్లుగా తీసుకున్న మారుతి, టీజర్ లోనే వారి ముగ్గురి గ్లామర్ ను బాగా ఎలివేట్ అయ్యేలా చేశాడు. గ్లామర్ క్వీన్లుగా సోషల్ మీడియాలో తమ అందాలను ఒలకబోస్తూ దిగే ఫోటోలను షేర్ చేసే నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ ఇద్దరూ కూడా రాజా సాబ్ టీజర్ లో బాగానే అందాలను ఆరబోశారు. టీజర్ చూస్తుంటే నిధి అగర్వాలే మెయిన్ హీరోయిన్ అనిపిస్తోంది. రిద్ధి టీజర్ లో ఒక్క ఫ్రేమ్‌కే పరిమితమైనా చాలా హాట్ గా కనిపించింది. ప్రభాస్ రొమాంటిక్, గ్లామరస్ సినిమా చేయాలని ఆశ పడుతున్న ఫ్యాన్స్ కోరిక ఈ సినిమాతో తీరనుందని రాజా సాబ్ టీజర్ చూశాక క్లారిటీ వచ్చింది.
