ప్రభాస్, చరణ్ ని కాదని..!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ వరుస క్రేజీ సినిమాలు చేస్తున్నాడు. అతను చేస్తున్న ఈ సినిమాల వల్ల కోలీవుడ్ ఫ్యాన్స్ సూపర్ ఖుషి అవుతున్నారు.
By: Tupaki Desk | 2 May 2025 4:25 AMకోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ వరుస క్రేజీ సినిమాలు చేస్తున్నాడు. అతను చేస్తున్న ఈ సినిమాల వల్ల కోలీవుడ్ ఫ్యాన్స్ సూపర్ ఖుషి అవుతున్నారు. ముఖ్యంగా ఖైదీ, విక్రం, లియో, కూలీ సినిమాలతో తనకంటూ ఒక సెపరేట్ మార్క్ సెట్ చేసుకున్నాడు లోకేష్. ప్రస్తుతం రజినీతో కూలీ సినిమా చేస్తున్న లోకేష్ ఈ సినిమాతో కూడా మరో సెన్సేషన్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ఐతే ఈ డైరెక్టర్ తో సినిమా చేయాలని తెలుగు స్టార్స్ కూడా ఆసక్తిగా ఉన్నారు.
లోకేష్ తో సినిమా చేసేందుకు ప్రభాస్ ఇంట్రెస్ట్ గా ఉన్నాడని టాక్. రెబల్ స్టార్ ప్రభాస్ హోంబలె ప్రొడక్షన్ లో చేసే సినిమా లోకేష్ నే డైరెక్ట్ గా తీసుకోవాలని చూస్తున్నారట. మరోపక్క రామ్ చరణ్ కూడా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్నాడని తెలుస్తుంది. ఐతే లోకేష్ కనకరాజ్ ప్లాన్స్ మాత్రం వేరేగా ఉన్నాయి. కూలీ సినిమా తర్వాత లోకేష్ వెంటనే కార్తితో ఖైదీ 2ని సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది.
ఆదే కాదు ఖైదీ 2 తర్వాత రోలెక్స్ అనే సినిమా కూడా ప్లానింగ్ లో ఉంది. ఈ రెండే కాదు విక్రం 2 మీద కూడా వర్క్ చేయాలని చూస్తున్నాడు లోకేష్. సో ఈ సినిమాలు ఉన్నాయి కాబట్టి లోకేష్ ని తెలుగు స్టార్స్ కోసం తీసుకొచ్చే సీన్ ఉంటుందని చెప్పడం కష్టం. ముఖ్యంగా లోకేష్ లాంటి స్టార్ డైరెక్టర్ తన సినిమాలను వన్ ప్లాన్ చేసుకుంటాడు. ప్రభాస్, చరణ్ తో సినిమాలు చేయాలంటే వాళ్ల కోసం లోకేష్ వెయిట్ చేసే అవకాశం ఉండదు.
తను కమిటైన సినిమాలకు పనిచేయడానికే ఎలా లేదన్నా ఐదేళ్లు పట్టేలా ఉంది. మరి అలా అయితే లోకేష్ కోసం ప్రభాస్, రామ్ చరణ్ అంత టైం వేసే చేస్తారా లేదా మరో సినిమాలు చేస్తారా అన్నది చూడాలి. ఐతే రెబల్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం లోకేష్ యూనివర్స్ లో ప్రభాస్ సినిమా పడితే మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో సంచలనాలు సృష్టించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రభాస్ తోనే కాదు చరణ్ తో లోకేష్ సినిమా పడినా కూడా ఆ హంగామా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు ఆడియన్స్.