Begin typing your search above and press return to search.

రాజాసాబ్‌ : టాప్‌ 10లో మళ్లీ ప్రభాస్‌, కానీ..!

రాజాసాబ్‌ సినిమా నుంచి వచ్చిన టీజర్‌కి మంచి స్పందన దక్కింది.

By:  Tupaki Desk   |   17 Jun 2025 10:46 AM
రాజాసాబ్‌ : టాప్‌ 10లో మళ్లీ ప్రభాస్‌, కానీ..!
X

ప్రభాస్‌ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ 'రాజాసాబ్‌'. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ తెలుగు సినిమా కోసం హిందీ ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా విడుదల అయిన టీజర్‌కి వస్తున్న వ్యూస్‌ను చూస్తే హిందీ ప్రేక్షకులు రాజాసాబ్‌కి వందల కోట్ల వసూళ్లు కట్టబెట్టడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సినిమా ఆలస్యం అయింది. ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయింది. డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయడం కన్ఫర్మ్‌ అయింది. అప్పటి వరకు సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ మొత్తం పూర్తి అయ్యే విధంగా ప్లాన్‌ చేశారు.

రాజాసాబ్‌ సినిమా నుంచి వచ్చిన టీజర్‌కి మంచి స్పందన దక్కింది. ఆ టీజర్‌లో ప్రభాస్ మాత్రమే కాకుండా ముగ్గురు హీరోయిన్స్‌ ఉన్నారు, అంతే కాకుండా బాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ సంజయ్‌ దత్‌ కూడా ఉన్నాడు. టీజర్‌ రెండు నిమిషాలకు మించి ఉండటం కూడా పాజిటివ్‌ రెస్పాన్స్ రావడంకు ఒక కారణం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. యూట్యూబ్‌లో టీజర్‌కి వస్తున్న స్పందన నేపథ్యంలో సినిమాకు భారీ బిజినెస్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీజర్ విడుదలైన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాల జాబితాలో టాప్‌ 10 లో ప్రభాస్ సినిమాలు ఇప్పటికే మూడు ఉన్నాయి. నెం.1 స్థానంలో ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందని సలార్ సినిమా టీజర్ ఉంది. సలార్‌ టీజర్‌ 24 గంటల్లోనే 83 మిలియన్‌ల వ్యూస్‌ను దక్కించుకుంది.

ఆ తర్వాత స్థానంలో ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్‌ సినిమా టీజర్‌ నిలిచింది. ఓం రౌత్‌ దర్శకత్వంలో వచ్చిన ఆదిపురుష్‌ సినిమా టీజర్‌ 24 గంటల్లో 68.96 మిలియన్‌ల వ్యూస్‌ను రాబట్టింది. మూడో స్థానంలో ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్‌ 2 టీజర్‌ నిలిచింది. ఆ టీజర్‌కి 68.83 మిలియన్‌ల వ్యూస్‌ సొంతం చేసుకుంది. ఆ తర్వాత స్థానంలో మళ్లీ ప్రభాస్ నిలిచాడు. 4వ స్థానంలో ప్రభాస్‌ హీరోగా నటించిన రాధేశ్యామ్‌ నిలిచింది. ఆ సినిమాకు 42.66 మిలియన్‌ల వ్యూస్ నమోదు అయ్యాయి. ఆ తర్వాత పుష్ప 2, డుంకీ సినిమాలు నిలిచాయి. ప్రభాస్‌ రాజాసాబ్‌ సినిమా టీజర్‌కి అనూహ్య స్పందన దక్కింది.

ప్రభాస్‌, మారుతి కాంబోలో రూపొందిన హర్రర్‌ కామెడీ మూవీ 'రాజాసాబ్‌' టీజర్‌కి 24 గటల్లో 31.3 మిలియన్‌ల వ్యూస్ నమోదు అయ్యాయి. మేకర్స్ ఇంకాస్త సీరియస్‌గా ప్రమోషన్ చేసి, జాత్రత్తలు తీసుకుని పీఆర్‌ చేసి ఉంటే కచ్చితంగా టాప్‌ 5 లో రాజాసాబ్ టీజర్ ఉండేదని ప్రభాస్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్స్‌లోనూ ఈ సినిమా టీజర్‌ను స్ట్రీమింగ్‌ చేయడం జరిగింది. అంతే కాకుండా ఈ టీజర్‌ను మీడియా వారికి లైవ్‌ ఇవ్వడం వల్ల కూడా తక్కువ మంది చూశారని టాక్‌. అసలు విషయం ఏంటి అనేది పక్కన పెడితే రాజాసాబ్‌ టీజర్‌ కి వచ్చిన స్పందనతో మేకర్స్ ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అనుకున్న తేదీకి విడుదల చేయాలని భావిస్తున్నారు.