Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో డార్లింగ్ మూవీకి గట్టి పోటీ?

అయితే రాజా సాబ్ మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. హారర్ కామెడీ జోనర్ లో గ్రాండ్ గా రూపొందుతున్న ఆ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి అయినట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   26 July 2025 12:25 PM IST
Raja Saab Clash Update
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ భారీ చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన రాజా సాబ్ సినిమాను పూర్తి చేస్తుండగా.. మరోవైపు హను రాఘవపూడి మూవీ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

అయితే రాజా సాబ్ మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. హారర్ కామెడీ జోనర్ లో గ్రాండ్ గా రూపొందుతున్న ఆ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి అయినట్లు తెలుస్తోంది. మిగిలిన పెండింగ్ పార్ట్ ను చకచకా కంప్లీట్ చేయాలని మేకర్స్ చూస్తున్నట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో గుమ్మడికాయ కొట్టనున్నారట.

మారుతి దర్శకత్వం వహిస్తున్న రాజా సాబ్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. డిసెంబర్ 5వ తేదీన సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.

దీంతో అంతా మూవీ కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ కు భారీ రెస్పాన్స్ రావడంతో మంచి అంచనాలు పెట్టుకున్నారు. అయితే రాజా సాబ్ మూవీ.. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. సౌత్ పక్కనపెడితే.. నార్త్ లో పెద్ద స్థాయిలో విడుదల అవ్వడం ఖాయం.

ఎందుకంటే డార్లింగ్ కు నార్త్ లో వేరే లెవెల్ క్రేజ్ ఉంది. దీంతో బాహుబలి తర్వాత ఆయన సినిమాలు అన్నీ అక్కడ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు రాజా సాబ్ రిలీజ్ కానుండగా.. బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే డిసెంబర్ 5వ తేదీన రెండు బాలీవుడ్ బడా సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి!

బీ టౌన్ స్టార్ హీరో రణవీర్ సింగ్ క్రేజీ చిత్రం ధురంధర్ ఆ రోజే విడుదల కానుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఉరి ఫేమ్ ఆదిత్య ధార్ దర్శకత్వం వహించగా, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్, ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరోవైపు, హైదర్, కామినే తర్వాత షాహిద్ కపూర్, విశాల్ భరద్వాజ్ రోమియో కోసం మూడోసారి జతకట్టారు. ఆ సినిమా కూడా డిసెంబర్ 5న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. గ్యాంగ్‌ స్టర్ డ్రామాగా రానున్న ఆ సినిమాను సాజిద్ నదియాద్వాలా నిర్మిస్తున్నారు. అలా డిసెంబర్ 5న రాజా సాబ్, ధురంధర్, రోమియో మధ్య గట్టి పోటీ ఎదురవనుంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.