'రాజాజాబ్' టీజర్ అప్‌డేట్.. ఐమాక్స్‌లో ప్లాన్?
చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అందుతున్న ఆఫ్ ది రికార్డ్ సమాచారం ప్రకారం జూన్ 16న సినిమా టీజర్‌ను ఐమాక్స్ లో స్క్రీనింగ్ చేయబోతున్నారు.
By: Tupaki Desk | 12 Jun 2025 6:52 PM ISTప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన చేస్తున్న రాజాసాబ్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మారుతి దర్శకత్వంలో దాదాపు మూడు ఏళ్ల క్రితం ప్రారంభం అయిన ఈ సినిమా అనేక కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. మారుతి దర్శకత్వంలో సినిమా ఏంటి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ మొదట తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు వారే రాజాసాబ్ సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతున్న ఈ హర్రర్ కామెడీ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయిందని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
గత ఏడాది నుంచి అదుగో.. ఇదుగో అంటూ రాజాసాబ్ సినిమా విడుదలను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కచ్చితంగా సినిమాను విడుదల చేస్తాం అంటూ బలంగా ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ సినిమా విడుదల తేదీ చివరి నిమిషంలో మార్చుతున్నట్లు ప్రకటించారు. అనివార్య కారణాల వల్ల సినిమాను విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా నుంచి టీజర్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొన్ని వారాలుగా ఈ సినిమా టీజర్ విషయమై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎట్టకేలకు ఈ విషయమై మేకర్స్ నుంచి సమాచారం అందింది. జూన్ 16న రాజాసాబ్ టీజర్ విడుదల కాబోతుంది.
చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అందుతున్న ఆఫ్ ది రికార్డ్ సమాచారం ప్రకారం జూన్ 16న సినిమా టీజర్‌ను ఐమాక్స్ లో స్క్రీనింగ్ చేయబోతున్నారు. ఆ తర్వాత యూట్యూబ్ లో విడుదల చేస్తారు. టీజర్ లాంచ్ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పలువురు పాల్గొనబోతున్నారు. ప్రభాస్ మరో సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న కారణంగా టీజర్ లాంచ్‌కి హాజరు కాకపోవచ్చు అని తెలుస్తోంది. దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు, హీరోయిన్స్ లో ఇద్దరు కూడా ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం అందుతోంది. ఈ విషయమై ఒకటి రెండు రోజుల్లోనే అధికారికంగా ప్రకటన వస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ కొత్త మాస్ లుక్‌ను రివీల్ చేశారు. టీజర్‌లో మరింతగా మాస్ ఎలిమెంట్స్ ఉంటాయని తెలుస్తోంది.
తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాను హిందీలో ప్రముఖ నిర్మాణ సంస్థ విడుదల చేయబోతుంది. హాలీవుడ్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా హ్యారీపోర్టర్ ను తలపించే విధంగా ఈ సినిమాలోని థ్రిల్లర్ సీన్స్ ఉంటాయని బాలీవుడ్ నిర్మాత అంటున్నారు. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని విధంగా ఈ సినిమాలో హర్రర్ కాన్సెప్ట్ ఉంటుందని, భయపెట్టడం మాత్రమే కాకుండా నవ్వించడం కూడా ఈ సినిమా చేస్తుంది అంటూ అభిమానులకు మేకర్స్ హామీ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో రాజాసాబ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కనుక రాజాసాబ్ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది ప్రభాస్‌కి మరో వెయ్యి కోట్ల సినిమాగా నిలుస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.
