'రాజాసాబ్' టీజర్ డేట్ ఫిక్సయ్యిందా
ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'రాజాసాబ్' అప్ డేట్ విషయంలో ఎదురు చూసి చూసి అభిమానులు కూడా నీరసించిపోయారు.
By: Tupaki Desk | 29 May 2025 3:00 PM ISTప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'రాజాసాబ్' అప్ డేట్ విషయంలో ఎదురు చూసి చూసి అభిమానులు కూడా నీరసించిపోయారు. ఏప్రిల్ లో రిలీజ్ అవుతుందన్న చిత్రం రిలీజ్ కాకపో వడంతో? ఆ సినిమా గురించి మళ్లీ పెద్దగా డిస్కషన్ కూడా జరగలేదు. రిలీజ్ అయినప్పుడే చూసుకుందాం అన్న ధోరణిలో అభిమానులంతా సైలెంట్ అయిపోయారు. చివరికి సన్నివేశం రాజుగారు అన్నట్లు 'గేమ్ ఛేంజర్' రిలీజ్ అయినప్పుడే అవుతుందులే అన్నట్లు మారిపోయింది.
అప్పటి నుంచి సినిమా గురించి సోషల్ మీడియాలో కథనాలకు పుల్ స్టాప్ పడింది. చివరికి ఈ చిత్రం ఈ ఏడాది కూడా రిలీజ్ కాదని వచ్చే ఏడాదే రిలీజ్ అంటూ కొత్త కథనాలు మొదలయ్యాయి. తాజాగా 'రాజాసాబ్' అభిమానులకు ఓ గుడ్ న్యూస్. ఈ సినిమా టీజర్ జూన్ 6న రిలీజ్ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో టీజర్ ఎలా ఉండబోతుంది? అన్న ఆసక్తి అభిమానుల్లో మొదలవ్వడం ఖాయం.
మరి ఈ టీజర్ మారుతి ఎలా సిద్దం చేస్తున్నాడు? అన్నది చూడాలి. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ప్రభాస్ లుక్...కొన్ని గ్లింప్స్ రిలీజ్ అయ్యాయి. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మారుతి కంటెంట్ పై వాటితోనే బజ్ తీసుకొచ్చాడు. కానీ సినిమా డిలే అయ్యే సరికి ఆ బజ్ కూడా తగ్గిపోతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందా? లేదా? అన్నది కూడా సరైన క్లారిటీ లేదు.
మేకర్స్ దీనిపై కూడా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. రిలీజ్ కు కారణం పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమంటూ మరో కారణం కూడా తెరపైకి వస్తుంది. దీంతో ఏది నిజమో? ఏది అబద్దమో అర్దం కానీ సన్నివేశం ఏర్ప డుతుం ది. మరి టీజర్ రిలీజ్ తో నైనా సినిమాకి సంబంధించి పూర్తి అప్డేట్ ఇస్తారా? అన్నది చూడాలి.
