Begin typing your search above and press return to search.

రాజా సాబ్ స్టోరీ ఇలా ఉంటుందా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో రాజా సాబ్ రూపొందుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 Jun 2025 9:18 AM IST
రాజా సాబ్ స్టోరీ ఇలా ఉంటుందా?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో రాజా సాబ్ రూపొందుతున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నటుడు సంజయ్‌ దత్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.


రొమాంటిక్ కామెడీ జోనర్ లో సిద్ధమవుతున్న రాజా సాబ్ ను భారీ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. అయితే సినిమాను షూటింగ్ కొంత అయ్యేవరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఆ తర్వాత టైటిల్ పోస్టర్ ను విడుదల చేయడంతో ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి.


ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ వెయిట్ చేశారు. ఇప్పుడు టీజర్ ను రిలీజ్ చేసి ఒక్కసారిగా సంచలనం సృష్టించారు. వింటేజ్ ప్రభాస్ ను సినిమాలో చూపిస్తున్నట్లు.. కూల్ గా డార్లింగ్ కనపడనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అదిరిపోయే విజువల్స్, సూపర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, వేరే లెవెల్ ప్రభాస్ యాక్షన్ అండ్ లుక్స్ తో మెప్పించారు.


అయితే సినిమాలో ప్రభాస్ డ్యుయల్ రోల్ పోషిస్తున్నారని ఇప్పటికే అందరికీ క్లారిటీ వచ్చేసింది. అదే సమయంలో ఇప్పుడు ఓ ప్రభాస్ ఫ్యాన్ చేసిన సోషల్ మీడియా పోస్ట్.. వైరల్ గా మారింది. ఇప్పటి వరకు ప్రమోషనల్ కంటెంట్ ద్వారా స్టోరీలో ఇలా ఉంటుందేమోనని సదరు నెటిజన్లు అంచనా వేస్తున్నారు.


టీజర్ లో యంగ్ ప్రభాస్ రోల్ ను చూపించిన మేకర్స్.. తాత పాత్రను చూపించలేదు. ఆయనే రాజా సాబ్ అంట. ఎక్కడో సుదూర అడవి ప్రాంతంలో ఉన్న కోట.. దెయ్యం బంగ్లాలా అనిపించినా లోపల మాత్రం రాజభవనంలా ఉంటుంది. చావు తర్వాత కూడా తానే అనుభవించాలనే ఒక రాజు సంజయ్ దత్.. వలయాన్ని ఏర్పాటు చేసుకుంటాడు.


రాజు, రాణి సన్నివేశాలను టీజర్ లో చూపించారు. టీజర్ లో చూపించిన ఒక తాళం.. అది బంగ్లాది కాదు.. అంతులేని సంపద ఉన్న గదిదని తెలుస్తోంది. దాన్ని స్వాధీనం చేసుకోవడానికి కొందరు ట్రై చేస్తుంటారు. ఓసారి ఫ్రేమ్ ను దెయ్యం పట్టుకున్నట్లు ఉండగా.. మరోసారి ఫ్రేమ్ నుంచి వచ్చినట్లు చూపించారు. ఇవన్నీ సంపద ఉన్న గదికి కాపలాగా తెలుస్తోంది.

ఆ తర్వాత యంగ్ ప్రభాస్ రోల్.. ఫైట్ సీన్ తో ఎంట్రీ ఇస్తారని అర్థమవుతోంది. అప్పుడే సాంగ్ కూడా ఉంటుంది. తర్వాత నిధి అగర్వాల్ కు బండి కొంచెం మెల్లగా అని చెబుతారు. రిద్ధి కుమార్ తో ప్రేమలో పడతారు. మాళవిక ఫైట్ సీన్ తో ఎంట్రీ ఇస్తుంది. ఫుల్ డిచ్ లో ఉన్న ప్రభాస్ ఆమెను చూసి హ్యాపీ అవుతారు.

బంగ్లాలోకి ప్రభాస్ సింగిల్ గానే వెళ్తారు. అక్కడ మిగతా వారు ఉంటారు. ఆ సమయంలో రాజా సాబ్ పునర్జన్మ రానున్నట్లు తెలుస్తోంది. డార్లింగ్ ఫ్యామిలీని చూపించినట్లు ఉన్నారు. ఓ హీరోయిన్ కు ప్రభాస్ కళ్ల ముందే పెళ్లి జరిగినట్లు అర్థమవుతోంది. ఇవన్నీ గెస్ మాత్రమే.. డిసెంబర్ 5నే అసలు విషయం తెలుస్తుంది.

చివరగా.. ప్రభాస్ అనుకోకుండా సంజయ్ దత్ రాజ్ మహల్ లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఏం జరిగింది.. ప్రభాస్ కు రాజ్ మహల్ కు సంబంధమేంటి.. భయపెట్టిస్తున్న తాత ఎవరు.. వంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.