Begin typing your search above and press return to search.

రాజాకి ఫ్యాన్స్ గోడు వినబట్లేదా..?

రాజా సాబ్ సినిమాపై ముందు ఏర్పడిన ఆ బజ్ అంతా చిత్ర యూనిట్ చేస్తున్న లేట్ వల్ల పోయేలా ఉంది.

By:  Tupaki Desk   |   27 May 2025 3:00 AM IST
రాజాకి ఫ్యాన్స్ గోడు వినబట్లేదా..?
X

రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ సినిమాపై ఫ్యాన్స్ లో కన్ ఫ్యూజన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. థ్రిల్లర్ జోనర్ లో రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక మోషన్ పోస్టర్ ఒక్కటే వదిలారు కానీ తర్వాత ఏది రాలేదు. రాజా సాబ్ టీజర్ ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటూ ఊరించడం తప్ప మేకర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు.

రెబల్ స్టార్ ఫ్యాన్స్ రాజా సాబ్ దర్శక నిర్మాతల మీద ఫైర్ అవుతున్నారు. ఓ పక్క సోషల్ మీడియాలో వారిపై అసంతృప్తిని వెల్లడిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఐతే రాజా సాబ్ టీజర్ త్వరలో వస్తుందని చిత్ర యూనిట్ నుంచి ఒక హింట్ వచ్చింది. ప్రభాస్ ప్రస్తుతం హాలీడేస్ లో ఉన్నాడు. అతను ఇటలీ లో జాలీ మూడ్లో ఉన్నాడు. టీజర్ రావాలంటే ప్రభాస్ వాయిస్ ఇవ్వాలి అందుకే ఇన్నాళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది.

ఐతే ప్రభాస్ రావడం వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగిందట. అయినా కూడా ఇంకా టీజర్ ఎప్పుడన్న క్లారిటీ రావట్లేదు. రాజా సాబ్ సినిమాపై ముందు ఏర్పడిన ఆ బజ్ అంతా చిత్ర యూనిట్ చేస్తున్న లేట్ వల్ల పోయేలా ఉంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నా కూడా ఫ్యాన్స్ కోరినప్పుడు వారిని ఎంగేజ్ చేస్తూ ప్రమోషనల్ కంటెంట్ ఇవ్వాలి అలా కాకుండా అసలు ఫ్యాన్స్ ని పట్టించుకోకుండా ఉంటే మాత్రం కష్టమే అని చెప్పొచ్చు.

ప్రభాస్ రాజా సాబ్ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకు థమన్ మ్యూజిక్ స్పెషల్ గా ఉంటుంది. సో తప్పకుండా రాజా సాబ్ వర్తబుల్ అనిపిస్తుందేమో చూడాలి. ప్రభాస్ సినిమా ప్రమోషన్స్ చేసినా చేయకపోయినా రిలీజ్ టైం లో కావాల్సిన బజ్ వస్తుంది. కానీ సినిమా గురించి మేకర్స్ ఎందుకింత సీక్రెట్ గా ఉంటున్నారు అన్నది రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి అర్ధం కావట్లేదు. ఐతే ఫ్యాన్స్ ఎంత ఫైర్ మీద ఉన్నా కూడా అలా ఓ టీజర్ వదిలితే మాత్రం శాంతించే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.