అప్పుడు హీరోయిన్‌గా.. ఇప్పుడు స్పెషల్ సాంగ్‌లో!
అయితే ఇప్పుడు రాజా సాబ్ లోని స్పెషల్ సాంగ్ చేయబోయే హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా పేరు వినిపిస్తోంది.
By: Tupaki Desk | 7 July 2025 6:28 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాల్లో ది రాజా సాబ్ కూడా ఒకటి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మామూలుగా అయితే ఈ సినిమా ఎప్పుడో రిలీజవాల్సింది కానీ మధ్యలో కొన్ని కారణాల వల్ల షూటింగ్ లేటైంది. ఇప్పుడు తిరిగి మళ్లీ పరిస్థితులు అనుకూలించడంతో రాజా సాబ్ ను వేగంగా పూర్తి చేసే పనిలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.
హార్రర్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ప్రభాస్ తన కెరీర్లోనే మొదటి సారి ఈ జానర్ లో సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందని ఎప్పట్నుంచో అంటున్న సంగతి తెలిసిందే. రాజా సాబ్ లో స్పెషల్ సాంగ్ ఉందని తెలిసినప్పటి నుంచి అందులో ఏ హీరోయిన్ నటిస్తుందా అని తెలుసుకోవడానికి అందరూ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఎంతోమంది స్టార్ హీరోయిన్ల పేర్లు కూడా వార్తల్లోకి వచ్చాయి. అయితే ఇప్పుడు రాజా సాబ్ లోని స్పెషల్ సాంగ్ చేయబోయే హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా పేరు వినిపిస్తోంది. ఈ మధ్య వరుస పెట్టి స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఐటెం సాంగ్స్ కు కేరాఫ్ గా మారిన తమన్నా రాజా సాబ్ లో ప్రభాస్ తో కలిసి కాలు కదుపుతుందని అంటున్నారు.
రాజా సాబ్ లోని స్పెషల్ సాంగ్ షూటింగ్ డేట్స్ కోసం చిత్ర యూనిట్ తమన్నాతో చర్చలు జరిపారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంతన్నది తెలియాలంటే రాజా సాబ్ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. కాగా గతంలో ప్రభాస్ కు జోడీగా తమన్నా మూడు సినిమాల్లో నటించారు. రెబల్, బాహుబలి1, బాహుబలి2లో ప్రభాస్ కు జోడీగా నటించిన తమన్నా ఇప్పుడు ప్రభాస్ పక్కన స్పెషల్ సాంగ్ చేస్తుందని వార్తలు వస్తుండగా అందరికీ ఈ సాంగ్ పై ఇంట్రెస్ట్ పెరిగింది.
ఇక రాజా సాబ్ సినిమా విషయానికొస్తే ఈ సినిమాలో ప్రభాస్ ను డైరెక్టర్ మారుతి వింటేజ్ లుక్ లో చూపించబోతున్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతుంది. రాజా సాబ్ లో ప్రభాస్ సరసన మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయన్లుగా నటిస్తుండగా, సంజయ్ దత్ సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానున్నట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.
