Begin typing your search above and press return to search.

రాజాసాబ్ రిలీజ్ ఫిక్సైపోయిందా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రాజాసాబ్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 April 2025 3:30 AM
రాజాసాబ్ రిలీజ్ ఫిక్సైపోయిందా?
X

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రాజాసాబ్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. స‌లార్ టైమ్ లో మొద‌లైన సినిమా ఇంకా సెట్స్ లోనే ఉంది. రాజాసాబ్ తో పాటే ప్ర‌భాస్ పౌజీ కూడా ప‌ట్టాలెక్కించ‌డంతో స‌మ‌యం కుదిర‌ప్పుడ‌ల్లా రాజాసాబ్ కి డేట్లు ఇస్తున్నాడు. అలా ఆయ‌న డేట్లు ఇచ్చిన‌ప్పుడు మారుతి షూటింగ్ చేసుకుంటు వ‌స్తున్నాడు. దీంతో చిత్రీక‌ర‌ణ న‌త్త న‌డ‌క‌న సాగుతుంది.

ఈ స‌మ్మ‌ర్ లో రిలీజ్ అవుతుంద‌నుకున్నారు. కానీ రిలీజ్ లేద‌ని తేలిపోయింది. స‌మ్మ‌ర్ రేసులో లేని నేప‌థ్యంలో 2025 లో ఎప్పుడైనా విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంద‌ని అంతా న‌మ్ముతున్నారు. కానీ అస‌లు సంగ‌తేంటంటే? ఈ ఏడాదిలోనే రాజాసాబ్ రిలీజ్ కాద‌ని స‌న్నిహిత వ‌ర్గాల నుంచి లీకులందుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ వ‌చ్చే ఏడాది ప్లాన్ చేస్తున్నారుట‌. `పౌజీ` కంటే ముందే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌కూడ‌ద‌ని ప్ర‌భాస్ స‌హా అత‌ని స‌న్నిహితులు భావిస్తున్నారుట‌.

`పౌజీ` పాన్ ఇండియా చిత్రం. 1800 ఏళ్ల క్రితం నాటి వార్ అండ్ ల‌వ్ బ్యాక్ డ్రాప్ లో హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కిస్తున్నాడు. భారీ వార్ స‌న్నివేశాల‌తో పాటు అంద‌మైన ల‌వ్ స్టోరీని కూడా ఆవిష్క‌రిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ ఐడెంటిటీ కూడా మారిపోతుందంటున్నారు. పాన్ ఇండియా లో డార్లింగ్ కి స‌రికొత్త ఇమేజ్ ఏర్ప‌డుతుంద‌ని స్ట్రాంగ్ గా చెబుతున్నారు. ఈనేప‌థ్యంలో రాజాసాబ్ రిలీజ్ పౌజీ కంటే ముందు చేయ‌డంలో త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుత‌న్నారుట‌.

పౌజీ రిలీజ్ అయిన త‌ర్వాత రాజాసాబ్ రిలీజ్ అయినా ఆ ప్ర‌భావం పెద్ద‌గా ఉండ‌ద‌ని భావిస్తున్నారుట‌. రాజాసాబ్ కామెడీ కం హార‌ర్ థ్రిల్ల‌ర్. ఇందులో ఓ స‌రికొత్త ప్ర‌భాస్ ని ప్రేక్ష‌కులు చూడ‌బోతున్నారు. ఆయ‌న ఎంతో ఇష్ట‌ప‌డి చేస్తోన్న చిత్రం కూడా ఇది. మారుతి సినిమాలంటే డార్లింగ్ ఇష్టం. ప్రేమా క‌థా చిత్ర‌మ్ కి ప్ర‌భాస్ అభిమాని. ఆ సినిమా న‌చ్చే మారుతికి డైరెక్ట్ చేసే అవ‌కాశం క‌ల్పించారు.