రాజాసాబ్.. అది కూడా డౌటేనా?
అయితే మేలో టీజర్ ను రిలీజ్ చేసి కొన్ని డౌట్స్ అయినా క్లియర్ చేయాలని మారుతి భావిస్తున్నట్లు ఆ మధ్య టాక్ వచ్చింది.
By: Tupaki Desk | 9 May 2025 11:30 AMపాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి. మొదట్లో కాస్త అటు ఇటు ఉన్నా.. అప్డేట్స్ తో మేకర్స్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేశారు.
అదే సమయంలో ప్రభాస్ మొదటిసారి హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ లో నటిస్తుండడంతో మూవీపై అందరి ఫోకస్ ఉంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధికుమార్ ఫిమేల్ లీడ్ రోల్స్ పోషిస్తుండగా.. బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. అయితే సైలెంట్ గా అప్పుడు రాజాసాబ్ షూటింగ్ స్టార్ట్ అవ్వగా.. ఇప్పటికీ ఇంకా పూర్తి కాలేదు. మరో 50 రోజుల షూటింగ్ పార్ట్ పెండింగ్ ఉందని సమాచారం. దీంతో ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన మే 16వ తేదీన సినిమా రిలీజ్ అవ్వడం డౌటే.
ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఇప్పట్లో మూవీ రిలీజ్ అయినట్లు కనపడడం లేదు. అదే సమయంలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాదిలోనే సినిమా రిలీజ్ అయినట్లు లేదని కొందరు నెటిజన్లు అనుమానపడుతున్నారు. దీంతో ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలని డార్లింగ్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.
అయితే మేలో టీజర్ ను రిలీజ్ చేసి కొన్ని డౌట్స్ అయినా క్లియర్ చేయాలని మారుతి భావిస్తున్నట్లు ఆ మధ్య టాక్ వచ్చింది. అందుకు సంబంధించిన వర్క్ కూడా చేస్తున్నారని తెలిసింది. అదే సమయంలో ప్రస్తుతం ఇటలీలో ఉన్న ప్రభాస్.. మే నెల మధ్యలో హైదరాబాద్ వచ్చి టీజర్ డబ్బింగ్ పూర్తి చేస్తారని వార్తలు వచ్చాయి.
కానీ ఇప్పుడు ప్రభాస్.. మేలో రారట. జూన్ లోనే హైదరాబాద్ వస్తారని తెలుస్తోంది. అలా ఇప్పుడు టీజర్ రిలీజ్ అవ్వడం కూడా డౌటేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. రకరకాల రూమర్లు స్ప్రెడ్ అవుతున్నాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ మరోసారి నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అసలెందుకలా అని కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి రాజాసాబ్ పై మేకర్స్ ఫుల్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.