Begin typing your search above and press return to search.

రాజా సాబ్ నెల రోజుల ప్రమోషన్స్ ప్లానింగ్..!

రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమా డిసెంబర్ ఫస్ట్ వీక్ రిలీజ్ అవుతుంది.

By:  Tupaki Desk   |   27 Jun 2025 9:31 AM IST
రాజా సాబ్ నెల రోజుల ప్రమోషన్స్ ప్లానింగ్..!
X

రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమా డిసెంబర్ ఫస్ట్ వీక్ రిలీజ్ అవుతుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ అందిస్తున్న మ్యూజిక్ రాజా సాబ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుందని అంటున్నారు. ఈమధ్యనే టీజర్ తో ఫ్యాన్స్ లో అంచనాలు పెంచాడు మారుతి.

రాజా సాబ్ ప్రమోషన్స్ విషయంలో మొన్నటిదాకా చిత్ర యూనిట్ ని రెబల్ ఫ్యాన్స్ ఎటాక్ చేస్తూ వచ్చారు. సినిమా సెట్స్ మీదకు వెళ్లి రెండేళ్లు అవుతున్నా కనీసం టీజర్ కూడా వదల్లేదని బాగా ఫైర్ అయ్యారు. ఐతే ఎప్పుడైతే రాజా సాబ్ టీజర్ రిలీజైందో అప్పటి నుంచి ఫ్యాన్స్ రియాక్షన్ లో మార్పు వచ్చింది. ఏమో అనుకున్నాం కానీ మారుతి ప్రభాస్ తో ఏదో అద్భుతాన్నే చేస్తున్నాడు అన్న భావన కలిగేలా చేశాడు.

రాజా సాబ్ టీజర్ చూస్తే అసలు కథ చూచాయగా అర్ధం అవుతున్నా కచ్చితంగా ఇదొక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని చూపించారు. ఐతే రాజా సాబ్ కి సరిగా ప్రమోషన్స్ చేయట్లేదని ఫ్యాన్స్ మొన్నటిదాకా అసంతృప్తి పడగా డిసెంబర్ రిలీజ్ కాబట్టి సినిమా రిలీజ్ నెల రోజులు ముందు నుంచి ప్రమోషన్స్ మొదలు పెట్టాలని చూస్తున్నారట. అందుకు తగిన ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.

పాన్ ఇండియా లెవెల్ లో రాజా సాబ్ భారీ రిలీజ్ ప్లానింగ్ ఉండగా అందుకు తగిన ప్రమోషన్స్ ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సో తప్పకుండా రాజా సాబ్ రెబల్ ఫ్యాన్స్ అందరి ఊహలకు మించి ప్రమోషన్స్ ఉండనున్నాయి. రాజా సాబ్ తో ప్రభాస్ మరో సూపర్ హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. మరి సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుంది అన్నది చూడాలి.

రాజా సాబ్ థ్రిల్లర్ మాత్రమే కాదు ఎంటర్టైనింగ్ విషయంలో కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో ప్రభాస్ రోల్ అటు కామెడీ పంచుతూనే అవసరమైన టైం లో హీరోయిజం చూపిస్తాడని అంటున్నారు. డిసెంబర్ లో రాజా సాబ్ రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ప్రభాస్ ఆ నెక్స్ట్ హను రాఘవపుడితో చేస్తున్న ఫౌజీని కూడా 2026 సమ్మర్ కి వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు.