Begin typing your search above and press return to search.

జూలై నుంచి ప్ర‌భాస్ రంగంలోకి!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 'రాజాసాబ్' రిలీజ్ తేదీ ప్ర‌క‌టించిన నాటి నుంచి మ‌ళ్లీ జోష్ అందుకుంది.

By:  Tupaki Desk   |   28 Jun 2025 2:05 PM IST
జూలై నుంచి ప్ర‌భాస్ రంగంలోకి!
X

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 'రాజాసాబ్' రిలీజ్ తేదీ ప్ర‌క‌టించిన నాటి నుంచి మ‌ళ్లీ జోష్ అందుకుంది. రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తోనూ మంచి హైప్ క్రియేట్ అయింది. అప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి బ‌జ్ లేని సినిమాకు ఒక్క‌సారిగా ఊపొచ్చింది. రిలీజ్ ఆల‌స్య‌మైనా? ప‌డిపోయిన బ‌జ్ అంతా మ‌ళ్లీ పైకి లేస్తోంది. సినిమాపై ప్రేక్షకాభిమానుల్లో ఉత్సాహం మొద‌లైంది.

ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ ముగింపు ద‌శ‌కు చేరుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రో కొత్త అప్ డేట్ బ‌య ట‌కు వ‌చ్చింది. త్వ‌ర‌లో మొద‌లు కాబోయే కొత్త షెడ్యూల్ షూటింగ్ లో ప్ర‌భాస్ జూలై మొదటి వారం నుంచి పాల్గొంటాడు. హైద‌రాబాద్ లో నిర్మించిన ప్యాలెస్ సెట్ లో ప్ర‌భాస్ తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నారు. దీంతో షూటింగ్ దాదాపు పూర్త‌యిన‌ట్లేన‌ని తెలుస్తోంది.

అనంత‌రం పాట‌ల చిత్రీకర‌ణ‌కు రంగం సిద్ద‌మ‌వుతుంది. పాట‌ల‌కు సంబంధించి విదేశాలు వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం. ఇండియాలో కూడా కొన్ని ఎగ్జోటిక్ లోకేష‌న్ల‌లో పాట‌ల చిత్రీక‌ర‌ణ ఉంటుంద‌ని తెలిసింది. అందులో భాగంగా క‌శ్మీర్ లో ఓ పాట ప్లాన్ చేస్తున్నారట‌. వీటికి సంబంధించి మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది. డార్లింగ్ 'రాజాసాబ్' కు డేట్లు ఇచ్చాడంటే పౌజీ నుంచి విరామం దొరికిన‌ట్లు తెలుస్తోంది.

భారీ వార్ అండ్ ల‌వ్ స్టోరీ బ్యాక్ డ్రాప్లో పౌజీ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్ర‌భాస్ శారీర‌కంగానూ ఎక్కువ క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో రాజాసాబ్ కు పూర్తి స్థాయిలో డేట్లు కేటాయించ‌లేక‌పోయారు. పౌజీకి విరామం ఇచ్చిన స‌మ‌యంలో ఈ సినిమాకు డేట్లు ఇస్తున్నారు. ఈ కార‌ణంగానే రిలీజ్ ఆల‌స్యమ‌వుతుంది. ఎట్ట‌కేల‌కు రాజాసాబ్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. కాబ‌ట్టి ఈ షెడ్యూల్ తో ప్ర‌భాస్ పోర్ష‌న్ అంతా పూర్తవుతుంది. అటుపై మ‌ళ్లీ పాటల చిత్రీక‌ర‌ణ కోసం డేట్లు ఇవ్వాల్సి ఉంటుంది.